Harish Rao Huzurabad: హుజూరాబాద్ లో కాంగ్రెస్, బీజేపీలను స్వీప్ చేస్తున్న హరీష్

హుజూరాబాద్ లో మకాం వేసిన ఆర్థిక మంత్రి హరీష్ రావు.. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ లను టార్గెట్ చేశారు. ప్రతి గ్రామంలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున ఆ పార్టీల నేతలను టీఆర్ఎస్ లోకి లాగేస్తున్నారు. తాజాగా జమ్మికుంటలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో కోరపల్లి వల్బాపూర్ గ్రామాలకు చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన యాదవ యువకులు పోచమల్లు నాయకత్వంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా గ్రామస్థులను ఆకట్టుకునే ప్రయత్నాలను […]

Written By: NARESH, Updated On : August 31, 2021 6:55 pm
Follow us on

హుజూరాబాద్ లో మకాం వేసిన ఆర్థిక మంత్రి హరీష్ రావు.. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ లను టార్గెట్ చేశారు. ప్రతి గ్రామంలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున ఆ పార్టీల నేతలను టీఆర్ఎస్ లోకి లాగేస్తున్నారు. తాజాగా జమ్మికుంటలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో కోరపల్లి వల్బాపూర్ గ్రామాలకు చెందిన 50 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన యాదవ యువకులు పోచమల్లు నాయకత్వంలో టీఆర్ఎస్ లో చేరారు.

ఈ సందర్భంగా గ్రామస్థులను ఆకట్టుకునే ప్రయత్నాలను హరీష్ రావు మొదలు పెట్టారు. పథకాలు, అభివృద్ధి పనులతో వారిని కొడుతున్నారు. కులవృత్తుల పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో హరీష్ రావు ముందుకెళుతున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న 7.61 లక్షల మంది గొల్ల కురుమలకు ( 20 గొర్రెలు, 1 పొటేలు చొప్పున) ఒక యూనిట్ ను 1.25 లక్షల రూపాయల ఖర్చుతో గొర్రెల యూనిట్లను 75 శాతం సబ్సిడీ పై పంపిణీ చేసే కార్యక్రమాన్ని 2017 సంవత్సరంలో ప్రారంభించామని.. హుజూరాబాద్ లోనూ అమలు చేస్తున్నామని తెలిపారు.

ఇక చేరికల సందర్భంగా మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాల గురించి వివరించారు. హరీష్ మాట్లాడుతూ ‘‘మొదటి విడతలో 79.16 లక్షల గొర్రెలను 3,76,985 మంది లబ్దిదారులకు పంపిణీ చేయగా, వాటికి ఒక కోటి 30 లక్షల గొర్రె పిల్లలు పుట్టాయ్. .పుట్టిన గొర్రె పిల్లల విలువ సుమారు 6500 కోట్ల రూపాయలు ఉంటుంది.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంతో అద్బుతమైన ఫలితాలు వచ్చాయి. 2019 పశుగణన లెక్కల ప్రకారం గొర్రెల పంపిణీ, అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రం 1.92 కోట్ల గొర్రెల సంఖ్యతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గొర్రెల పంపిణీ కార్యక్రమంతో గొర్రెల సంపద అభివృద్ధి చెందటమే కాకుండా 1.22 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి జరిగింది. రానున్న రోజులలో తెలంగాణ రాష్ర్టం నుండి మాంసం ఎగుమతి చేసే దిశగా అభివృద్దిని సాధిస్తుంది. పెరిగిన గొర్రెల ధరలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సహృదయంతో 2 వ విడత లో గొర్రెల పంపిణీ కార్యక్రమం అమలుకు 1.25 లక్షల రూపాయలుగా ఉన్న యూనిట్ ధరను 1.75 లక్షల రూపాయాలకు పెంచడం జరిగింది. రెండో విడతలో 6,125 కోట్ల వ్యయంతో 3.5 లక్షల మంది అర్హులైన గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నాం. దీంతో పాటు యాదవులను రాజకీయ అధికారంలో భాగస్వామ్యం చేసేందుకే హుజూరాబాద్ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చారు.’’ అని హుజూరాబాద్ అభ్యర్తి వైపే హరీష్ వీటన్నింటిని మలిచారు.

‘గెల్లు శ్రీనును గెలిపించుకుందాం. హుజూరాబాద్ అభివృధ్ది చేసుకుందాం. బీజేపీ ఏడేళ్ళో చేసిందేమి లేదు. హుజూరాబ్ కు చేసిందేంటో చెప్పాలి. పెట్రోల్, గ్యాస్, డిజీల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోంది. రాయితీలను‌ఎత్తి వేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టింది. దళిత, గిరిజన, ఓబీసీలకు ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్ లేకుండా బీజేపీ ప్రభుత్వం చేస్తోంది.’’ అని హరీష్ రావు ప్రత్యర్థి బీజేపీని ఎండగట్టారు. ఇలాంటి పార్టీకి బుద్ది చెప్పడానికి ఇది సరైన విషయం అన్నారు. హుజూరాబాద్ గడ్డ తెరాస అడ్డా అని అన్నారు. హుజురాబాద్ ప్రజలకు అండగా గులాబీ జెండా ఉంటున్నారు.