
దేశంలోనే ప్రశాంతమైన నగరంగా హైదరాబాద్ నిలుస్తోంది. అందుకే ఇక్కడికి అమేజాన్, గూగుల్ , మైక్రోసాఫ్ట్ సహా దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయి. ఎవ్వరూ ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక.. కేసీఆర్ సర్కార్ ఏర్పడ్డాక హైదరాబాద్లో ఒక్క బాంబ్ బ్లాస్ట్ జరగలేదు. ఉగ్రవాదుల ఆగడాలు చోటుచేసుకోలేదు. ఇక మతకల్లోలాలకు తావు లేదు.
Also Read: విప్లవాభిమానులకు షాక్.. కేసీఆర్ గళాన్ని విన్పిస్తున్న గద్దరన్న..!
అయితే ఇప్పుడు బీజేపీ ఎంట్రీతో తెలంగాణలో కాస్త అలజడి చెలరేగుతోంది. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాతబస్తీకి వెళ్లి చార్మినార్ వద్ద అదీ మైనార్టీల ఏరియాలో కేసీఆర్ తో భేటికి రెడీ కావడం.. పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు పరిస్థితి చేయిదాటకుండా భారీగా బందోబస్తు కల్పించారు. ఒకవేళ వేరే వర్గం వారు వస్తే అక్కడ రావణ కాష్టం అయ్యేది.
దీన్ని బేస్ చేసుకొని… బీజేపీ నేతలు ఇప్పుడు మతం రంగు పులిమి అల్లకల్లోలం సృష్టించే రాజకీయం చేస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వాదన ఎత్తుకున్నారు. తాజాగా తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ కార్పొరేటర్లకు బీఫాంలు పంపిణీ చేసి జీహెచ్ఎంసీలో అభివృద్ధిపై ప్రగతి నివేదికను కేటీఆర్ విడుదల చేశారు. ఈ క్రమంలోనే బీజేపీని టార్గెట్ చేశారు.
హైదరాబాద్ ప్రజలను కేటీఆర్ ఒక్కటే ప్రశ్నించారు. టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థులకు ఇదే చెప్పాలని సూచించారు. ‘అభివృద్ధిలో దూసుకెళ్తున్న హైదరాబాద్ కావాలా? నిత్యం ఘర్షణలతో తల్లడిల్లే హైదరాబాద్ కావాలా? అని ప్రజలను ప్రశ్నించండి’ అని పిలుపునిచ్చారు.
Also Read: కేసీఆర్ తో సవాల్ చేసి బండి అన్నంత పనిచేశాడే?
ఇప్పుడు బీజేపీపై టీఆర్ఎస్, కేటీఆర్ ఇదే మంత్రాన్ని వేస్తున్నారని అర్థమవుతోంది. ‘అభివృద్ధినా? అశాంతినా’ ఏది కావాలో తేల్చుకోవాలన్న కేటీఆర్ నినాదం ఇప్పుడు వైరల్ అయ్యింది. మరి బీజేపీ దీనికి ఎలాంటి కౌంటర్లు ఇస్తుందనేది ఆసక్తిగా మారింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్