https://oktelugu.com/

అంటించిన కేంద్రం: రగిలిన విశాఖ ‘ఉక్కు’ ఉద్యమం..

విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయడం ఖాయమని.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని కేంద్రం తేల్చేసిన వేళ ఏపీ భగ్గుమంది. విశాఖ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు రోడ్డెక్కారు. వారు చేపట్టిన ఆందోళన రాత్రి నుంచి కొనసాగుతోంది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ లోక్ సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానంతో విశాఖ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు భగ్గుమన్నారు. రాత్రి నుంచే విశాఖలో ఆందోళనలు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 9, 2021 8:55 am
    Follow us on

    విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయడం ఖాయమని.. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని కేంద్రం తేల్చేసిన వేళ ఏపీ భగ్గుమంది. విశాఖ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు రోడ్డెక్కారు. వారు చేపట్టిన ఆందోళన రాత్రి నుంచి కొనసాగుతోంది.

    విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ లోక్ సభలో అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన సమాధానంతో విశాఖ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు భగ్గుమన్నారు. రాత్రి నుంచే విశాఖలో ఆందోళనలు మిన్నంటాయి.

    జాతీయ రహదారిపై కూర్మన్నపాలెం కూడలి ఉక్కు పరిశ్రమ ప్రధాన ద్వారా వద్ద ఉక్కు ఉద్యమకారులు పెద్ద ఎత్తున చేరి ఆందోళనలు చేస్తున్నారు. కార్మికులంతా మానవహారంగా మారి రహదారిని దిగ్బంధించారు.

    కూర్మన్నపాలెం కూడలిలో ఆందోళనకారులు చేపట్టిన నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కేంద్రం ప్రకటనతో ఉన్న ప్రతులను ఉద్యమకారులు దగ్ధం చేశారు.

    కేంద్రం తీరుకు నిరసనగా మంగళవారం విశాఖలోని ఉక్కు పరిపాలనా భవనం ముట్టడికి ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. కార్మికుల ఆందోళనతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.