
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన సినిమాల్లో హీరోలను మార్చినా హీరోయిన్ గా మాత్రం అస్థానం నటి ‘పూజా హెగ్డే’నే.. ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత’ తీసినా.. ఆ తర్వాత ‘అల వైకుంఠపురంలో’ తీసినా ఆమెనే హీరోయిన్. హీరోయిన్లను త్రివిక్రమ్ అంత త్వరగా మార్చడు అని టాక్. అంతకుముందు వరుసగా ‘సమంత’ను హీరోయిన్ గా తీసుకున్నాడు. ఆమెకు పెళ్లి అయిపోవడంతో ఇప్పుడు ‘పూజా హెగ్డేను పట్టేశాడు.
ప్రస్తుతం త్రివిక్రమ్ కొత్త మూవీని జూనియర్ ఎన్టీఆర్ తో తీస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’తో బిజీగా ఉన్నారు. ఆ తరువాత త్రివిక్రమ్ చేయబోయే సినిమాలో నటిస్తాడు. అయితే ఎన్టీఆర్ కు జోడీగా హీరోయిన్ ఎవరనే విషయంపై టాలీవుడ్ లో హాట్ హాట్ చర్చ సాగింది. తాజాగా యంగ్ టైగర్ పక్కన అందాల భామ రష్మికా మందానా అవకాశం కోసం త్రివిక్రమ్ చుట్టూ చక్కర్లు కొడుతోందని.. ఆమెనే ఖాయమైందన్న టాక్ నడుస్తోంది.
రష్మికా మందాన ఇటీవల కొందరితో కలిసి త్రివిక్రమ్ ను కలిసినట్లు సమాచారం.. ఆ తరువాత మీడియాతో మాట్లాడకుండానే వెళ్లింది. అయితే ఎన్టీఆర్ కు జోడీగా రష్మికను ఖాయం చేసే పనిలో ఉన్నాడట త్రివిక్రమ్. అందులో భాగంగానే రష్మికను పిలిచినట్లు సమాచారం. అంతకుముందు అప్ఘనిస్తాన్ హీరోయిన్ అని ప్రచారం జరిగినా ఆ విషయంపై త్రివిక్రమ్ ఏ విధంగా స్పందించలేదు. అయితే ఇప్పుడు రష్మిక త్రివిక్రమ్ ను కలవడంతో ఇక ఈ బ్యూటీయే ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా ఖాయం అయ్యిందని ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. పెద్ద పెద్ద హీరోలతో చేస్తోంది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ బిజీ హీరోయిన్ గా ఉంది. ఈ భామ త్వరలో జూనియర్ తో కలిసి త్రివిక్రమ్ మూవీలో చేయబోతోందట.. వీరిద్దరి కాంబినేషన్లో ఇదే మొదటి సినిమా. ఈ కాంబినేషన్ కూడా హిట్ అయ్యి వరుసగా త్రివిక్రమ్ మూవీస్ లో రష్మికనే హీరోయిన్ గా కొనసాగుతుందా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.