
పవన్ కల్యాణ్ ఒకేసారి నాలుగు చిత్రాలను అనౌన్స్ చేశారు. ఇందులో ఓ చిత్రం కంప్లీట్ అయ్యి, వచ్చే నెల విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ.. ఫ్యాన్స్ తోపాటు సగటు ప్రేక్షకుడి క్యూరియాసిటీ మొత్తం ఒకే చిత్రంపై ఫోకస్ అయి ఉంది. అదే.. ‘హరిహర వీరమల్లు’!
Also Read: చరణ్ తో మరో స్టార్ హీరో.. త్రివిక్రమ్ కొత్త ఆలోచన !
దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన ప్రతీ అప్డేట్.. హై ఓల్టేజ్ రెస్పాన్స్ క్యాచ్ చేస్తోంది. 15వ శతాబ్దం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. నాటి చార్మినార్ ను కళ్లకు కట్టేందుకు ఇప్పటికే భారీ సెట్ ను నిర్మించారు. గండికోట సంస్థానానికి సంబంధించిన సెట్ కూడా నిర్మించారు.
ఈ సినిమాలో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగగా కనిపించబోతున్నాడనే సంగతి తెలిసిందే. కాబట్టి.. ఛేజింగ్ లు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరమల్లును పట్టుకునేందుకు రాజభటులు అశ్వాలతో దూసుకొస్తుంటే.. పవన్ సాగించే హార్స్ రైడింగ్ కు గూస్ బంస్ అవ్వడం ఖాయమట. ఈ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడానికి హాలీవుడ్ చిత్రాలకు వర్క్ చేసిన వీఎఫ్ఎక్స్ నిపుణులను రంగంలోకి దించారు దర్శకుడు క్రిష్.
కాగా.. చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. హరిహర వీరమల్లు కోసం మరో పది రోజుల డేట్స్ కేటాయించాడట పవన్. ఈ నెల 27 నుంచి సెట్స్ లో పాల్గొంటారట పవర్ స్టార్. ఈ షెడ్యూల్లో భారీయాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నాడు క్రిష్. ఇందుకోసం ఇప్పటికే ముంబై నుంచి వంద మంది ఫైటర్స్ ను రంగంలోకి దించి, వారికి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నాడట దర్శకుడు.
Also Read: ‘పూజా హెగ్డే’ కొత్తగా.. ఆచార్య కోసమే !
పవన్ సెట్స్ లో అడుగు పెట్టగానే.. ఈ వంద మంది ఫైటర్స్ తో తలపడే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తాడట. ఈ మధ్యనే కొందరు మల్లయోధులతో సాగించే పోరాటాన్ని షూట్ చేశారు. ఇప్పుడు ఈ షెడ్యూల్లోనూ ప్రధానంగా ఫైట్ సీన్సే తెరకెక్కిస్తారని తెలుస్తోంది.
దాదాపు 170 కోట్ల వ్యయంతో.. పవన్ కల్యాణ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా నిర్మిస్తున్నారు మెగా ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం. అంతేకాకుండా.. పవన్ కెరీర్లో తొలి హిస్టారికల్ మూవీ కూడా ఇదే కాబోతోంది. ఇలా.. ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకున్న ఈ మూవీలో యాక్షన్ సీన్స్ నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్ లో ఉండబోతున్నాయట.
అంతకంతకూ హై రేంజ్ క్యూరియాసిటీని ఫిల్ చేస్తున్న ఈ చిత్రానికి కీరవాణి మ్యూజిక్ తోడవడంతో.. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందోననే అంచనాలు వేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నిధి అగర్వాల్, బాలీవుడ్ భామ జాక్వెలిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్