https://oktelugu.com/

అవును..కేసీఆర్ మోడీని మెచ్చుకున్నారు..!?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్లేట్ ఫిరాయించాడు. మొదటి నుంచి కుటుంబ సభ్యులకు కూడా అర్థంకాని పనులు చేస్తున్న టీఆర్ఎస్ అధినేత ఇప్పుడు ఓ విషయంలో చేసిన పనికి టీఆర్ఎస్ నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు. కేసీఆర్ చెప్పిందే వేదం అన్నట్లుగా సాగుతున్న పార్టీ నాయకులు ఇప్పడు కేసీఆర్ చేసిన పనికి మాత్రం అయోమయానికి గురవుతున్నారు. ఇంతకీ టీఆర్ఎస్ దళపతి చేసిందేమిటి..? ఎందుకా ఆశ్చర్యం..? Also Read: అమావాస్య చంద్రులు..! టీఆర్ఎస్ పార్టీని దుబ్బాక ముందు.. దుబ్బాక తరువాతగా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 9, 2020 / 02:44 PM IST
    Follow us on

    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ప్లేట్ ఫిరాయించాడు. మొదటి నుంచి కుటుంబ సభ్యులకు కూడా అర్థంకాని పనులు చేస్తున్న టీఆర్ఎస్ అధినేత ఇప్పుడు ఓ విషయంలో చేసిన పనికి టీఆర్ఎస్ నాయకులు ఆశ్చర్యానికి గురయ్యారు. కేసీఆర్ చెప్పిందే వేదం అన్నట్లుగా సాగుతున్న పార్టీ నాయకులు ఇప్పడు కేసీఆర్ చేసిన పనికి మాత్రం అయోమయానికి గురవుతున్నారు. ఇంతకీ టీఆర్ఎస్ దళపతి చేసిందేమిటి..? ఎందుకా ఆశ్చర్యం..?

    Also Read: అమావాస్య చంద్రులు..!

    టీఆర్ఎస్ పార్టీని దుబ్బాక ముందు.. దుబ్బాక తరువాతగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దుబ్బాక ఉప ఎన్నిక కంటే ముందు తమకు ప్రత్యర్థి కాంగ్రెస్ అని భావించిన కేసీఆర్ ఆ పార్టీని నామరూపాల్లేకుండా చేశారు. ఇక తనకు ఎదురే లేదని భావించారు. అయితే దుబ్బాక ఉప ఎన్నిక తరువాత బీజేపీ బలం చూపించడంతో కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయసాగారు. ఆ తరువాత జరిగిన మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీని ప్రధాన లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా బీజేపీ ‘బద్మాష్ ’ పార్టీ అని తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఇక తాను మూడో ఫ్రంట్ కూటమికి రెడీ అవుతున్నానని, ఇందుకోసం ప్రతిపక్షాలన్నంటిని ఏకం చేస్తానని కేసీఆర్ చెప్పడంతో బీజేపీపై గులాబీ నేత యుద్ధం ప్రకటిస్తున్నాడని అందరూ భావించారు.

    అయితే జీహెచ్ఎంసీలోనూ టీఆర్ఎస్ కు అనుకూల సీట్లు రాకపోయే సరికి బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టని భారత్ బంద్ లో కూడా పాల్గొని మోడీపై విమర్శలు చేశారు. కేంద్ర రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చి వారికి అన్యాయంచేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    Also Read: కొత్త వ్యవసాయ చట్టాల్లో మార్పులకు కేంద్రం సుముఖం?

    కానీ ఇక్కడే అసలు విషయం బయటపడింది. నిన్నటి వరకు మోడీకి వ్యతిరేకమైన కేసీఆర్ నేడు ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టని ‘సెంట్రల్ విస్టా’పై కేసీఆర్ మోడీని మెచ్చుకున్నాడు. వ్యవసాయ చట్టాల విషయంలో మోడీజీకి వ్యతిరేకమే అయినా పార్లమెంట్ కొత్త భవనం నిర్మాణం చేపట్టడంపై ఆయన శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే తాను కూడా తెలంగాణలో కొత్త సచివాలాయాన్ని నిర్మిస్తున్నానని, కొత్త పార్లమెంట్ భవనం నిర్మించడం మంచి పనే అని కేసీఆర్ ఓ లేఖ రాశాడు. దీంతో ఇప్పడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్