https://oktelugu.com/

బీజేపీ విషయంలో కేసీఆర్ ‘గ్రేట్’ మిస్టేక్ చేస్తున్నారా? 

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి గడిచిన ఆరేళ్లలో ఎదురులేకుండా పోయింది. టీఆర్ఎస్ ఆడిందే ఆటగా.. పాడింతే పాటగా నడిచింది. రాష్ట్రంలో ఎలాంటి ఎన్నిక జరిగిన వార్ వన్ సైడ్ అన్నట్లు టీఆర్ఎస్ హవా కొనసాగేది. కారు స్పీడుకు ప్రతిపక్షాల పార్టీలన్నీ బేజారయ్యేవి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు టీఆర్ఎస్ కు అనుకూలంగా లేవని దుబ్బాక ఉప ఎన్నికతో స్పష్టమైంది. Also Read: ఫైట్ కు రె‘ఢీ’ అవుతున్న జగన్, చంద్రబాబు ఈక్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రావడంతో మరోసారి రాజకీయ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 26, 2020 / 08:46 PM IST
    Follow us on

    తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి గడిచిన ఆరేళ్లలో ఎదురులేకుండా పోయింది. టీఆర్ఎస్ ఆడిందే ఆటగా.. పాడింతే పాటగా నడిచింది. రాష్ట్రంలో ఎలాంటి ఎన్నిక జరిగిన వార్ వన్ సైడ్ అన్నట్లు టీఆర్ఎస్ హవా కొనసాగేది. కారు స్పీడుకు ప్రతిపక్షాల పార్టీలన్నీ బేజారయ్యేవి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు టీఆర్ఎస్ కు అనుకూలంగా లేవని దుబ్బాక ఉప ఎన్నికతో స్పష్టమైంది.

    Also Read: ఫైట్ కు రె‘ఢీ’ అవుతున్న జగన్, చంద్రబాబు

    ఈక్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రావడంతో మరోసారి రాజకీయ వేడిరాజుకుంది. దుబ్బాక ఫలితం నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలను కేసీఆరే రంగంలోకి దిగారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ ప్రచార బాధ్యతలు నిర్వహించగా ఈసారి మాత్రం టీఆర్ఎస్ కు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కేసీఆర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయితే కేసీఆర్ మాత్రం దుబ్బాకలో చేసిన మిస్టేక్ నే గ్రేటర్లోనూ రిపీట్ చేస్తున్నారు.

    వ్యూహాలు రచించడంలో.. ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడంలో కేసీఆర్ దిట్ట. అయితే దుబ్బాకలో మాత్రం ఆయన పప్పులేవీ బీజేపీ ముందు ఉడకలేదు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ కు చెందిన వారి నివాసాల్లో లెక్కకు చూపని నగదు ఉందంటూ పోలీసులు అదుపులోకి తీసుకోవడం అధికార పార్టీకి ప్రతికూలంగా మారగా ఇది బీజేపీకి అనుకూలమైంది. దీంతో దుబ్బాకలో బీజేపీ స్వల్ప మెజార్టీతో విజయం సాధించింది.

    దుబ్బాక ఫలితం బీజేపీకి అనుకూలంగా రావడంతో బీజేపీ శ్రేణుల్లో జోష్ ఉత్సాహంగా నెలకొనగా టీఆర్ఎస్ లో నైరాశ్యం నెలకొంది. ప్రస్తుతం టీఆర్ఎస్ నేతలు దుబ్బాకలో చేసిన తప్పులనే గ్రేటర్లో చేస్తున్నట్లు కన్పిస్తోంది. గతంలోనే ఎన్నడూలేని అంశాలు సైతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చర్చకు దారితీస్తున్నాయి.

    Also Read: కాపీ కొట్టడానికి తెలివి ఉండాలె.. బీజేపీ మేనిఫెస్టోపై కేటీఆర్

    నగరంలో పాతబస్తీ.. కొత్త బస్తీ అంటూ విభజన రేఖ స్పష్టంగా రావటంతో బీజేపీ పార్టీ మజ్లిస్ తో టీఆర్ఎస్ అనుబంధాన్ని బూచిగా చూపెట్టి ఓట్లు దండుకోవాలని భావిస్తోంది. దీంతో టీఆర్ఎస్ నేతలు మజ్లిస్ తో తమకు ఎలాంటి బంధంలేదన్నట్లు చెబుతోంది. ఈక్రమంలోనే పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న బండి సంజయ్ మాటలు పెను దుమారం రేపాయి.

    ముక్కలుముక్కలుగా ఉన్న హిందూ ఓటు బ్యాంకును గంపగుత్తగా సమీకరించాలని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ధీటుగా తిప్పకొట్టలేక టీఆర్ఎస్ తప్పటడుగులు వేస్తోంది. బీజేపీ హైదరాబాద్లో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తుంది. ఈ వ్యాఖ్యలు బీజేపీపై సానుభూతిని పెంచి ఆ పార్టీకి లాభం చేకూర్చనుండగా టీఆర్ఎస్ కు చేటుతెచ్చేలా కన్పిస్తున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ దుబ్బాకలో చేసిన తప్పిదమే గ్రేటర్లోనూ రిపీట్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్