https://oktelugu.com/

ట్రెండ్ ను ఫాలో అవుతున్న నాగ్.. సంచలన నిర్ణయం తీసుకున్నాడా?

టాలీవుడ్ మన్మథుడు.. కింగ్ నాగార్జున్ ట్రెండ్ తగ్గట్టుగా మారుతూ ఉంటారు. 60ఏళ్లు పైబడిన కూడా నవమన్మథుడిలా నాగ్ కన్పిస్తుంటాడు. ఎల్లప్పుడు హుషారుగా ఉండే నాగ్ తన కొడుకులైన చైతూ.. అఖిల్ కంటే సినిమాల్లో బీజీగా ఉంటూ సత్తా చాటుతున్నాడు. సీనియర్ హీరోల్లో ఒకరైన నాగార్జున ట్రెండ్ తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. Also Read: ఓటీటీ మూవీ హిట్టా.. ఫట్టా అనేది ఎవరు తేలుస్తారు? నాగార్జున తాజాగా నటిస్తున్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. కరోనా […]

Written By:
  • NARESH
  • , Updated On : November 26, 2020 / 08:39 PM IST
    Follow us on

    టాలీవుడ్ మన్మథుడు.. కింగ్ నాగార్జున్ ట్రెండ్ తగ్గట్టుగా మారుతూ ఉంటారు. 60ఏళ్లు పైబడిన కూడా నవమన్మథుడిలా నాగ్ కన్పిస్తుంటాడు. ఎల్లప్పుడు హుషారుగా ఉండే నాగ్ తన కొడుకులైన చైతూ.. అఖిల్ కంటే సినిమాల్లో బీజీగా ఉంటూ సత్తా చాటుతున్నాడు. సీనియర్ హీరోల్లో ఒకరైన నాగార్జున ట్రెండ్ తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.

    Also Read: ఓటీటీ మూవీ హిట్టా.. ఫట్టా అనేది ఎవరు తేలుస్తారు?

    నాగార్జున తాజాగా నటిస్తున్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. కరోనా కారణంగా ఈ మూవీ షూటింగు నిలిచిపోవడంతో నాగార్జున కొద్దిరోజులు బిగ్ బాస్-4 షోకు హోస్టుగా చేశారు. ఈ షో చేస్తూనే మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకొని వైల్డ్ డాగ్ షూటింగులో పాల్గొన్నాడు. ఇటీవల కులుమానాలిలో జరిగిన షూటింగులో పాల్గొని తన పార్ట్ ను నాగ్ పూర్తి చేశాడు.

    ఈక్రమంలోనే వైల్డ్ డాగ్ మూవీని త్వరలోనే రిలీజు చేసేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేస్తోంది. ఈ మూవీ ఓటీటీలో రిలీజు అవుతుందని గతంలో ప్రచారం జరుగగా దీనిని చిత్రయూనిట్ ఖండించింది. ప్రస్తుతం థియేటర్లు తెరుచుకున్నప్పటికీ పరిస్థితులు చక్కబడటానికి చాలా సమయం పట్టేలా ఉంది. ఈమేరకు నాగార్జున ఈ సినిమాను ఓటీటీలో రిలీజు చేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

    థియేటర్లు వందశాతం అక్యుపెన్సీతో నడిచినప్పటికీ సినిమా రిలీజులు మొదలైతే నిర్మాతల మధ్య కొట్లాటలు తప్పవు. ఈ ఏడాది వేసవి నుంచి రిలీజు నోచుకోకుండా ఉన్న సినిమాలకే తొలి ప్రాధాన్యం దక్కనుండటంతో తాజా సినిమాలు వెనక్కి వెళ్లక తప్పదు. దీంతో నాగార్జున నిర్మాతల బాగోగులను దృష్టిలో ఉంచుకొని వైల్డ్ డాగ్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఒప్పుకుంటున్నారని సమాచారం.

    Also Read: ముందుగా రొమాన్స్ మొదలెట్టిన పుష్ప !

    ఇటీవల హీరో సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ మూవీ కూడా ఓటీటీలో రిలీజైంది. వంద కోట్ల బిజినెస్ చేస్తుందని భావించిన సూర్య సినిమానే ఓటీటీలో రిలీజైందని.. ఇక తన సినిమా రిలీజైతే తప్పేంటని నాగ్ భావిస్తున్నారట. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న వైల్డ్ డాగ్ ను ఓటీటీలో రిలీజ్ చేసుకునేలా నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

    ఈమేరకు అమెజాన్ ప్రైమ్ ‘వైల్డ్ డాగ్’ మూవీకి ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందనే ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా కింగ్ నాగార్జున ట్రెండ్ తగ్గట్టుగా ఆలోచిస్తాడని మరోసారి రుజువు చేశారు. దీంతో నాగా.. మజాకా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్