తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అని వాదించేంత సామర్థ్యం జనసేన అధినేత పవన్ కల్యాణ్ సొంతం. తాను ఓ నిర్ణయాన్ని తీసుకుంటున్నాడంటే అది చేసి తీరుతామని ఆయన చెబుతుంటాడు. అయితే ఈ డైలాగులు సినిమా వరకే పనికొస్తున్నాయి. రాజకీయాల్లోకి వచ్చేసరికి పవన్ చెబుతున్నదొకటి చేస్తున్నదొకటని అర్థమవుతోంది. ఇలాంటి ప్రవర్తనతో పవన్ వ్యక్తిగతంగా లాభపడుతున్నా.. ఆయన పార్టీని నమ్ముకున్న వాళ్లు నట్టేట మునుగుతున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Also Read: కవితకు గట్టి కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్
రాజకీయాలు ఇంకా ఒంటబట్టని.. క్లీన్ పాలిటిక్స్ అంటున్న పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మొదటికే మోసానికి వస్తున్నాయి. కరోనా కాలం నుంచి కామ్ గా ఉన్న పవన్ దుబ్బాక ఉప ఎన్నిక తరువాత వార్తల్లోకి వచ్చాడు. తెలంగాణ బీజేపీని పొగడడంతో ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు అని అందరూ అనుకున్నారు. అయితే గ్రేటర్ ఎన్నికలకొచ్చేసరికి తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని జనసేన నాయకులు ప్రకటించారు.
Also Read: ఎంఐఎం, కేసీఆర్ రహస్య దోస్తీని కడిగేసిన అమిత్ షా
దీంతో హైదరాబాద్ లో అక్కడక్కడా జనసేన పార్టీలో ఉన్న కొందరు నాయకులకు బలం వచ్చినట్లయింది. అయితే నాటకీయ పరిణామాల మధ్య పవన్ ఒక్కసారిగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ నాయకులు ఎక్కడా పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఆ తరువాత ఢిల్లీ వెళ్లిన పవన్ బీజేపీ పెద్దలను కలిసినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కు బీజేపీ నేతలు ఏదో ఒక హామీ ఇస్తేనే పోటీ నుంచి తప్పుకున్నాడని అనుకుంటున్నారు.
ఇదిలా ఉండగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తాజాగా తమ పొత్తు భాగస్వామి అయిన పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీతో పొత్తు లేదని, ఆ పార్టీ తమకు అవసరం లేదంటూ కామెంట్లు చేశాడు. అయితే అరవింద్ చేసిన వ్యాఖ్యలపై ఏ ఒక్క బీజేపీ నాయకుడు ఖండించలేదు. కనీసం అరవింద్ సైతం తరువాత తన వ్యాఖ్యలను వెనకకు తీసుకోలేదు. దీంతో తాము బీజేపీ పెద్దల ఒత్తిడి మేరకే పోటీ నుంచి తప్పుకున్నామని, ఇప్పుడు ఎంపీ ఇలా అనడం సరికాదని జనసేన నాయకులు వివరణ ఇస్తున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం: తెలంగాణ పాలిటిక్స్
తాము ఒంటరిగా పోటీ చేస్తే ఎన్నోకొన్ని సీట్లు వచ్చేవని కొన్ని చోట్ల తమకు బలం ఉందని జన సైనికులు అనుకుంటున్నారు. అయితే పవన్ కూడా ఈ వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందించడం లేదు. వచ్చిన బాధంతా పార్టీలో ఉన్నవారికే. ఎందుకంటే తాము బీజేపీ నాయకులపై రెచ్చిపోతే పవన్ తమను పట్టించుకుంటాడా..? లేదా..? అని సందేహపడుతున్నారు. దీంతో ఆ పార్టీ నాయకులు ప్రస్తుతం కామ్ గా ఉండడం లేదా ఏదైనా పార్టీని చూసుకోవడం తప్ప ఇంకేమీ చేసేది లేదంటున్నారు.