ప్రపంచ దేశాల్లోని ప్రజలను కంటికి కూడా కనిపించని వైరస్ లు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. మార్చి నెల తొలి వారం నుంచి భారతదేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్ వల్ల ప్రజలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరో రెండు నెలల్లో సమర్థవంతమైన వ్యాక్సిన్ వస్తుందని ప్రజలు భావిస్తున్నారు.
Also Read: దేశ ప్రజలకు షాకింగ్ న్యూస్.. వ్యాక్సిన్ వచ్చినా మాస్కులు ధరించాల్సిందే..?
అయితే కరోనా వ్యాప్తి తగ్గక మునుపే మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ కరోనా వైరస్ కంటే ప్రమాదకరం అని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. కొత్తగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ పేరు ఛపారే వైరస్ కాగా ఈ వైరస్ కూడా మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతోందని సమాచారం. ఈ వైరస్ బారిన పడితే రక్తంతో కూడిన వాంతులు అవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: కరోనా విషయంలో మరో గుడ్ న్యూస్.. వచ్చే ఏడాదికి 10 కరోనా వ్యాక్సిన్లు..?
కొన్నేళ్ల క్రితం విజృంభించిన ఎబోలా వైరస్ తరహా లక్షణాలతో ఛపారే వైరస్ విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు, కరోనా మరణాలు తగ్గుతున్న తరుణంలో ఛపారే వైరస్ గురించి వెలుగులోకి వస్తున్న వార్తలు ప్రజల్లో భయాందోళనను రెట్టింపు చేస్తున్నాయి. అయితే ఈ వైరస్ కొత్తది కాదని చాలా అరుదుగా మాత్రమే మనుషులు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
2004 సంవత్సరంలో బొలీవియాలోని ఛపారే ప్రాంతంలో శాస్త్రవేత్తలు ఈ వైరస్ ను గుర్తించారు. తొలుత ఛపారే ప్రాంతంలో గుర్తించిన వైరస్ కావడంతో ఈ వైరస్ కు ఛపారే వైరస్ అని పేరు వచ్చింది. ఛపారే వైరస్ కొత్త కేసులు నమోదు కాకపోయినా పలు ప్రాంతాల్లో ఈ వైరస్ లక్షణాలు కొందరిలో కనిపిస్తూ ఉండటంతో ఈ వైరస్ గురించి చర్చ జరుగుతోంది. ఈ వైరస్ కు ఇప్పటివరకు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ ను కనిపెట్టలేకపోయారు.