తెలంగాణ సిద్ధించక ముందు, సిద్ధించాక ఏ స్థానానికి ఉప ఎన్నిక జరిగినా అక్కడ హరీశ్ ఒంటి చేత్తో వ్యవహారం నడిపించి పార్టీని భారీ మెజారిటీతో విజయ తీరాలకు చేర్చారు. విజయ తీరాలకు చేరగానే ఎప్పటిలాగే సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రశంసలు కురిపించడం జరిగిపోతూ వచ్చింది. కానీ దుబ్బాక ఉప ఎన్నిక విషయంలో ఫస్ట్ టైమ్ హరీశ్ వ్యూహం చతికిల పడింది. అభ్యర్థి సుజాత రెడ్డి కంటే హరీశ్ రావే అన్నీ తానై వ్యవహరించినా.. పార్టీ గెలవలేకపోయింది. తననైనా చూసి ఓటు వేయాలంటూ హరీశ్ ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. అంతలా కష్టపడ్డ హరీశ్‌ను టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఇప్పుడు బలి పశువును చేయనుందని ఓ వర్గం బలంగా విశ్వసిస్తోంది.
Also Read: ఇక రేవంత్ రెడ్డినే.. కాంగ్రెస్ లో ఏం జరుగబోతోంది?
దుబ్బాక రిజల్ట్‌ను మొత్తాన్ని మంత్రి హరీశ్ నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ హరీశ్ వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఈ ఎన్నికలో ఆది నుంచీ బలం చూపిస్తున్న బీజేపీని ఢీకొట్టి తమ సీటును తమ ఖాతాలోనే వసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నారు. అందుకే ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందుకు గెలుపు బాధ్యతను పూర్తిగా ట్రబుల్ షూటర్ హరీశ్ పైనే వేశారు. అయితే.. బీజేపీ చొచ్చుకొస్తోందని గ్రహించిన హరీశ్ కూడా అంతే కష్టపడ్డారు. అదే కాంగ్రెస్ ఉంటే.. టీఆర్‌ఎస్ అధిష్ఠానం దుబ్బాకను అంత సీరియస్‌గా తీసుకొని ఉండేది కాదన్నది మరో వర్గం టాక్.
Also Read: కేసీఆర్ ఇమేజీని కాపాడేందుకే ఆ న్యూస్ చానల్ తాపత్రయం!
మంత్రి హరీశ్, టీఆర్‌ఎస్ కేడర్ అంత చెమటోడ్చినా పార్టీ పరాభవం తప్పలేదు. చివరికి బీజేపీ సంచలన విజయం సాధించింది. దీంతో హరీశ్‌ను రాజకీయంగా టార్గెట్ చేయాలని టీఆర్‌ఎస్‌లోనే మరో వర్గం డిసైడ్ అయినట్లు సమాచారం. పార్టీ బంపర్ విక్టరీ సాధిస్తే ఆ కష్టం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఖాతాలోకి వేసుకుంటున్నారని, అదే విఫలమైతే ఆ మొత్తం వైఫల్యాన్ని మంత్రి హరీశ్ రావు ఖాతాలోకి పడేసి.. ఆయన్ను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని హరీశ్ వర్గం ఆరోపిస్తోంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
అంతేకాదు.. దుబ్బాకలో బీజేపీ విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు ముందే తెలుసని, అందుకే ఆ ఉప ఎన్నిక బాధ్యతను మంత్రి హరీశ్ నెత్తిన రుద్దారని తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. 24 గంటలూ ప్రజలకు హరీశ్ అందుబాటులోనే ఉంటారు. అంతేకాకుండా సీఎం నియోజకవర్గ వ్యవహారాలను కూడా స్వయంగా హరీశ్ రావే చూసుకుంటున్నారు. అటు ప్రభుత్వ బాధ్యతలు, ఇటు పార్టీ బాధ్యతలు మోస్తున్నా… అధిష్ఠానం మాత్రం దుబ్బాక వైఫల్యాన్ని హరీశ్ కు ఆపాదించడం బాగోలేదని అంటోంది. మరోవైపు బీజేపీ కూడా స్పందిస్తూ ఈ ఓటమిలో ని వైఫల్యాన్ని చూడకుండా ఎంతసేపు మంత్రి హరీశ్‌నే బలిపశువును చేయాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. మొత్తానికి దుబ్బాక వైఫల్యం మంత్రి హరీశ్ మెడకు చుట్టేసి.. ఆయన్ను రాజకీయ చదరంగంలో విఫల నేతగా చిత్రీకరించే ప్రయత్నాలు సాగుతున్నాయని ప్రచారం నడుస్తోంది.