https://oktelugu.com/

సీఎం మార్పు ‘ముందస్తు’ వ్యూహమేనా?

తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు త్వరలోనే జరుగబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం కేసీఆర్ తన పదవీ నుంచి తప్పుకొని తనయుడికి పదవీ కట్టబెడుతారనే ప్రచారాన్ని మంత్రులు.. ఎమ్మెల్యేలు కొద్దిరోజులుగా చేస్తున్నారు. నిప్పులేనిదే పొగరాదనే చందంగా టీఆర్ఎస్ లో ఏదో జరుగుతుందనే టాక్ మాత్రం విన్పిస్తోంది. Also Read: జగన్‌ హస్తిన బాట తెలంగాణ సీఎం మార్పుపై ప్రతిపక్షాలు సైతం ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. సీఎం కేసీఆర్ ను ఢీకొట్టే నాయకులు ప్రతిపక్షాల్లో ఎవరూ లేకపోవడంతో కేటీఆర్ సీఎం […]

Written By:
  • NARESH
  • , Updated On : January 19, 2021 / 11:22 AM IST
    Follow us on

    తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు త్వరలోనే జరుగబోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం కేసీఆర్ తన పదవీ నుంచి తప్పుకొని తనయుడికి పదవీ కట్టబెడుతారనే ప్రచారాన్ని మంత్రులు.. ఎమ్మెల్యేలు కొద్దిరోజులుగా చేస్తున్నారు. నిప్పులేనిదే పొగరాదనే చందంగా టీఆర్ఎస్ లో ఏదో జరుగుతుందనే టాక్ మాత్రం విన్పిస్తోంది.

    Also Read: జగన్‌ హస్తిన బాట

    తెలంగాణ సీఎం మార్పుపై ప్రతిపక్షాలు సైతం ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. సీఎం కేసీఆర్ ను ఢీకొట్టే నాయకులు ప్రతిపక్షాల్లో ఎవరూ లేకపోవడంతో కేటీఆర్ సీఎం అయితే తమకే కలిసి వస్తుందనే విపక్షాలు భావిస్తున్నాయి. దీంతో సీఎం మార్పుపై ఆ పార్టీలు పెద్దగా స్పందించడం లేదు.

    టీఆర్ఎస్ మాత్రం సీఎం మార్పుపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ముందు ప్రజలను ఏవిధంగానైతే సన్నద్ధం చేశారో అదే వ్యూహాన్ని సీఎం మార్పు విషయంలోనూ అవలంభిస్తున్నట్లు కన్పిస్తోంది. సీఎం మార్పుపై మంత్రులు.. ఎమ్మెల్యేలతో పదేపదే చెప్పడం ద్వారా ప్రజలను సైతం ఆ దిశగా సన్నద్ధం చేస్తున్నట్లుగా కన్పిస్తోంది.

    తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మరోవైపు 2022లో కేంద్రం జమిలి ఎన్నికలకు వెళుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే మంత్రి కేటీఆర్ సైతం ఇటీవల జమిలి ఎన్నికలపై స్పందిస్తూ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

    Also Read: నేడు కేసీఆర్‌‌ కాళేశ్వరం టూర్‌‌

    సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి చూపుతుండటంతో కేటీఆర్ కు సీఎంగా పట్టాభిషేకం చేస్తారనే టాక్ విన్పిస్తోంది. దీనికోసం ముందస్తుగానే మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ప్రతిపక్ష పార్టీలు.. ప్రజలను మానసికంగా కేసీఆర్ సిద్ధం చేస్తున్నట్లుగా కన్పిస్తోంది. అయితే దీనికంటే ముందు నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక.. పట్టభద్రుల ఎమ్మెల్సీల ఎన్నికల గండం టీఆర్ఎస్ దాటాల్సి ఉంటుంది.

    ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మంచి ఫలితాలు వస్తే కేటీఆర్ పట్టాభిషేకం ఎలాంటి అడ్డంకుల్లేకుండా జరుగడం ఖాయంగా కన్పిస్తోంది. ఒకవేళ తేడా వస్తే ఎలా ముందుకెళ్లాలనేది టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా వచ్చినా.. ప్రతికూలంగా వచ్చిన సీఎం కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ కానుండటంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్