ఏపీలో ప్రస్తుతం మత రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు వివాదానికి దారితీస్తున్నాయి. ఈ దాడుల నేపథ్యంలో పార్టీలు సైతం ఒక్కో విధంగా స్పందిస్తున్నాయి. అయితే.. పార్టీలు స్పందించడం ఒక ఎత్తయితే.. ఆధ్యాత్మిక వేత్త చిన్న జీయర్ స్వామి రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపడుతామంటూ చర్చకు దారితీశారు.
Also Read: జగన్ హస్తిన బాట
యాత్రలో భాగంగా ఇవాళ ఆధోనిలో ఆయన మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయన చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్న అనుమానాలు కలిగించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో, ఆలయాలను పరిరక్షించుకోవడానికి చిన్న జీయర్ స్వామి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆలయాల పై దాడులు చేస్తున్నది ఎవరు అన్న సంగతి పాలకులే తేల్చాలి అంటూ పాలకులపై ఒత్తిడి పెంచారు. అదేవిధంగా హిందూ ఆలయాల పరిరక్షణ బాధ్యత అర్చకులు, ధర్మకర్తలు, భక్తులతోపాటు ప్రతి ఒక్కరిదీ అంటూ ఆయన సూచించారు.
అయితే.. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఆయన మాట్లాడిన మాటలు చర్చకు దారితీశాయి. దళితులకు ఆలయాల్లో ప్రవేశం లేదు అన్నది కేవలం రాజకీయ స్లోగన్ మాత్రమే అని, అటువంటి సంప్రదాయం హిందూమతంలో లేదని, బ్రిటిష్ వారు దీనిని ఒక ఆయుధంగా ఉపయోగించుకున్నారని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు విన్నవారికి ఆయన చరిత్రను వక్రీకరిస్తున్నారనే అభిప్రాయం కలిగిస్తున్నాయి.
Also Read: కొడాలి వర్సెస్ దేవినేని.. గొల్లపూడిలో గోలగోల..!
అయితే.. కొన్ని చోట్ల స్వాతంత్రానికి పూర్వం దళితులకు ఆలయాల్లోకి ప్రవేశం ఉండేది కాదు. 1950 లో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ 14 ,ఆర్టికల్ 15తో పౌరులందరికీ సమానత్వం ప్రసాదించారు. ఆ తరువాత మాత్రమే దేవాలయాలలోకి దళితులకు ప్రవేశం పూర్తి స్థాయిలో లభించింది. ఇంత చరిత్ర మన కళ్లముందే కనిపిస్తున్నప్పటికీ పూర్తిగా బ్రిటీష్ వారిపై నెట్టివేయడానికి చిన్నజీయర్ స్వామి వంటి వారు చేస్తున్న వ్యాఖ్యలు చరిత్ర తెలిసిన వారిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్