ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్.. రూ.7000తో సౌత్ ఇండియా చుట్టేసే ఛాన్స్..?

ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్సీటీసీ రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల కోసం అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. కేవలం 7,000 రూపాయలు చెల్లించి ప్రయాణికులు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాలను దర్శించుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తోంది. దక్షిణ భారత్ యాత్ర ట్రైన్‌ పేరుతో అదిరిపోయే ప్యాకేజీని రైల్వే శాఖ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు ఎవరైతే దక్షిణ భారత్ యాత్ర ట్రైన్‌ ప్యాకేజీ కోసం బుక్ చేసుకుంటారో వాళ్లు కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, […]

Written By: Navya, Updated On : November 19, 2020 5:02 pm
Follow us on


ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఐఆర్సీటీసీ రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రయాణికుల కోసం అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. కేవలం 7,000 రూపాయలు చెల్లించి ప్రయాణికులు దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ ఆలయాలను దర్శించుకునే అవకాశాన్ని రైల్వే శాఖ కల్పిస్తోంది. దక్షిణ భారత్ యాత్ర ట్రైన్‌ పేరుతో అదిరిపోయే ప్యాకేజీని రైల్వే శాఖ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.

ప్రయాణికులు ఎవరైతే దక్షిణ భారత్ యాత్ర ట్రైన్‌ ప్యాకేజీ కోసం బుక్ చేసుకుంటారో వాళ్లు కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తంజావూరు, తిరుచిరపల్లి ప్రాంతాలను సందర్శించుకునే అవకాశం ఉంది. ఈ ప్యాకేజీకి బుక్ చేసుకున్న వాళ్లు ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ స్టేషన్లలో రైలు ఎక్కే అవకాశం ఉంటుంది. వచ్చే నెల 12న దక్షిణ భారత్ యాత్ర ట్రైన్‌ ప్రారంభమవుతుంది.

ఈ ట్రైన్ లో ప్రయాణించి ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలని అనుకుంటే 7,140 రూపాయలు చెల్లించి ప్రయాణం చేయవచ్చు. సికింద్రాబాద్‌లో రాత్రి 12 గంటలకు ఈ రైలు ప్రారంభమవుతుంది. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఛార్జీ ఉండదు. ఐదు సంవత్సరాలు దాటితే పిల్లలకు కూడా 7,140 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. రూ.8,610 చెల్లిస్తే 3 టైర్ ఏసీలో కూడా ప్రయాణించే అవకాశం ఉంటుంది.

ట్రైన్ లో ప్రయాణించిన ప్రయాణికులకు ఉచితంగా రైల్వే శాఖ ఆహారం అందిస్తుంది. ఆరు రోజుల పాటు ఉండే ఈ టూర్ లో మీరు కూడా జాయిన్ కావాలనుకుంటే ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లేదా సమీపంలో రైల్వే స్టేషన్ ను సంప్రదించి టికెట్లు బుక్ చేసుకోవచ్చు.