https://oktelugu.com/

టీఆర్ఎస్ 2వ జాబితా: సిట్టింగ్ లకు, మేయర్ బొంతుకు షాక్.. కొత్తవారికి టికెట్లు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల వేటలోనే పడి ఆపసోపాలు పడుతున్న వేళ టీఆర్ఎస్ ఏకంగా రెండో జాబితాను రిలీజ్ చేయడం విశేషంగా మారింది. Also Read: గ్రేటర్‌‌ లో కేసీఆర్ ఎంట్రీ‌‌.. ఇలా షాక్ ఇచ్చాడా? తాజాగా టీఆర్ఎస్ రెండో జాబితా విడుదలైంది.మొదటి జాబితాలో సిట్టింగ్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ.. రెండో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2020 / 05:02 PM IST
    Follow us on

    జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు జెట్ స్పీడుతో దూసుకెళ్తోంది. ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు ఇంకా అభ్యర్థుల వేటలోనే పడి ఆపసోపాలు పడుతున్న వేళ టీఆర్ఎస్ ఏకంగా రెండో జాబితాను రిలీజ్ చేయడం విశేషంగా మారింది.

    Also Read: గ్రేటర్‌‌ లో కేసీఆర్ ఎంట్రీ‌‌.. ఇలా షాక్ ఇచ్చాడా?

    తాజాగా టీఆర్ఎస్ రెండో జాబితా విడుదలైంది.మొదటి జాబితాలో సిట్టింగ్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ.. రెండో జాబితాలో కొంతమంది కొత్తవారికి అవకాశం ఇవ్వడం విశేషం. తాజాగా ప్రకటించిన 20 మంది అభ్యర్థులలో సిట్టింగ్ కార్పొరేటర్లను పక్కనపెట్టి మరీ కొత్త వారికి ఇవ్వడం విశేషంగా మారింది.

    నిన్న 105మంది అభ్యర్థులను ప్రకటించగా.. ఈరోజు మరో 20 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించింది. బల్దియాలో మొత్తం 150 డివిజన్లలో టీఆర్ఎస్ ఇప్పటికీ 125 దివిజన్లకు అభ్యర్థులను ప్రకటించడం విశేషం. మరో 25మంది అభ్యర్థుల పేర్లను ఈరోజు లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది.

    Also Read: సెంటిమెంట్ తో కొడుతున్న కేటీఆర్.. వర్కవుట్ అవుద్దా?

    తాజాగా ప్రకటించిన 20 మంది అభ్యర్థులలో కొందరు సిట్టింగ్ కార్పొరేటర్లకు టికెట్లు నిరాకరించి కొత్త వారికి ఇవ్వడం విశేషం. సికింద్రాబాద్ లో మూడు డివిజన్లు కొత్త వారికి ఇచ్చారు. ఇక ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి భార్య, అంబర్ పేట ఎమ్మెల్యే భార్యకు ఇంకా సీట్లు కేటాయించకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి టికెట్ ఆశిస్తున్న చర్లపల్లి స్థానం ఇంకా పెండింగ్ లో ఉండడం సంచలనంగా మారింది.

    *టీఆర్ఎస్ రెండో జాబితా ఇదే.. (20మంది)
    1. మైలార్‌దేవ్‌పల్లి- ప్రేమ్‌దాస్‌ గౌడ్‌
    2.బౌద్ధనగర్‌- కంది శైలజ
    3. షేక్‌పేట్‌- సత్యనారాయణ యాదవ్‌
    4.భోలక్‌పూర్‌- నవీన్‌కుమార్‌
    5.శాస్త్రిపురం- రాజేష్‌యాదవ్‌
    6.బేగంపేట్‌- మహేశ్వరి శ్రీహరి
    7. వివేకానందనగర్‌ కాలనీ- రోజా రంగారావు
    8.వినాయక్‌నగర్‌- బద్ధం పుష్పలతరెడ్డి
    9. సులేమాన్‌ నగర్‌- సరితా మహేష్‌
    10. కూకట్‌పల్లి- సత్యనారాయణ జూపల్లి
    11. అడ్డగుట్ట- ప్రసన్న లక్ష్మి
    12.మెట్టుగూడ- రాసూరి సునీత
    13.బేగంబజార్‌- పూజా వ్యాస్‌ బిలాల్
    14.మల్లాపూర్‌- దేవేందర్‌రెడ్డి
    15.హిమాయత్‌నగర్‌- హేమలత యాదవ్
    16.రాజేంద్రనగర్‌- శ్రీలత
    17. బాగ్‌అంబర్‌పేట- పద్మావతి రెడ్డి
    18. శేరిలింగంపల్లి- రాగం నాగేందర్
    19.బాలానగర్‌- రవీందర్‌రెడ్డి
    20. రామాంతపూర్‌- జోత్స్న

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్