
దేశంలో కోట్ల సంఖ్యలో కుటుంబాలు గ్యాస్ సిలిండర్ ను వినియోగిస్తున్నాయనే సంగతి తెలిసిందే. సాధారణంగా స్థిర నివాసం ఉన్నవాళ్లు పెద్ద గ్యాస్ సిలిండర్లను తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొన్ని నెలల పాటు నివాసం ఉండేవాళ్లు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లేవాళ్లు చిన్న గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తూ ఉంటారు. అలా చిన్న సిలిండర్లు తీసుకునే వారికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అదిరిపోయే శుభవార్త చెప్పింది.
Also Read: కట్టెల పొయ్యితో వంట చేస్తున్నారా.. ఆ అవయవానికి డేంజర్..?
సాధారణంగా పెద్ద సిలిండర్ తీసుకోవాలంటే తప్పనిసరిగా అడ్రస్ ప్రూఫ్ ను సమర్పించాలి. అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి మాత్రం చిన్న సిలిండర్లను అడ్రస్ ప్రూఫ్ లేకుండా ఏదో ఒక ఐడెంటిటీ కార్డును సమర్పించి పొందవచ్చు. ఈ చిన్న గ్యాస్ సిలిండర్లను ఇండేన్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు, గ్రాసరీ స్టోర్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి పొందే అవకాశం ఉంటుంది.
Also Read: కేంద్రం సంచలన నిర్ణయం.. ఎస్సీ విద్యార్థులకు శుభవార్త..?
5 కేజీల బరువు ఉండే గ్యాస్ సిలిండర్లు తక్కువగా గ్యాస్ సిలిండర్లను వినియోగించుకునే వాళ్లకు ప్రయోజనం చేకూరుస్తాయి. పెద్ద గ్యాస్ సిలిండర్లలో గ్యాస్ అయిపోయినా తక్షణ వినియోగం కోసం చిన్న గ్యాస్ సిలిండర్లను వినియోగించవచ్చు. సమీపంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించి చిన్న గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
ఇండేన్ గ్యాస్ వినియోగదారులు డిస్ట్రిబ్యూటర్ కు కాల్ చేసి చిన్న గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవచ్చు. అయితే చిన్న గ్యాస్ సిలిండర్ డెలివరీ కోసం 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇండేన్ గ్యాస్ కంపెనీ తీసుకున్న నిర్ణయం వల్ల గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.