
కరోనా వైరస్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఏపీలో కొత్త రకం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. యూకే నుంచి రాజమండ్రికి వచ్చిన ఓ మహిళకు కరోనా సోకింది. యూకే నుంచి ఢిల్లీ వచ్చిన ఆ మహిళకు కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అయితే, ఆమెను ఢిల్లీలోని క్వారంటైన్ లో ఉంచగా, అక్కడి నుంచి మహిళ తప్పించుకొని ఏపీ ఎక్స్ ప్రెస్ లో రాజమండ్రికి వచ్చింది. రాజమండ్రికి వచ్చిన మహిళను అధికారులు పట్టుకొని ఆసుపత్రికి తరలించారు. ఆమెతో పాటుగా ఆమె కొడుకును కూడా ఆసుపత్రికి తరలించారు. మహిళకు సోకింది కొత్త కరోనా కాదా అని తేల్చేందుకు రక్తనమూనాలను సేకరించారు. పూణే లోని వైరాలజి ల్యాబ్ కు పంపించి మహిళకు సోకింది కొత్త కరోనా కాదా అని తేల్చబోతున్నారు. రాష్ట్రంలో అత్యధిక కరోనా కేసులు తూర్పుగోదావరి జిల్లాలో నమోదయ్యాయి. కరోనా పేరు వింటే అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు.