రాత పరీక్ష లేకుండా బ్యాంక్ ఉద్యోగాలు.. రూ.60 వేల వేతనంతో..?

కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ఈ సంవత్సరం పోటీ పరీక్షలు ఆలస్యంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నెల మొదటి వారం నుంచి జనవరి నెల చివరి వారం వరకు వరుసగా వివిధ ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్షలు జరుగుతున్నాయి. అయితే మహమ్మారి విజృంభణను దృష్టిలో ఉంచుకుని పలు బ్యాంకులు రాతపరీక్ష కూడా లేకుండా ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. Also Read: నిరుద్యోగులకు ఐఓసీఎల్ శుభవార్త.. రూ.లక్ష వేతనంతో ఉద్యోగాలు..? ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఐడీబీఐ బ్యాంక్ నిరుద్యోగులకు […]

Written By: Navya, Updated On : December 24, 2020 10:21 am
Follow us on


కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ఈ సంవత్సరం పోటీ పరీక్షలు ఆలస్యంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నెల మొదటి వారం నుంచి జనవరి నెల చివరి వారం వరకు వరుసగా వివిధ ఉద్యోగాలకు సంబంధించిన రాతపరీక్షలు జరుగుతున్నాయి. అయితే మహమ్మారి విజృంభణను దృష్టిలో ఉంచుకుని పలు బ్యాంకులు రాతపరీక్ష కూడా లేకుండా ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి.

Also Read: నిరుద్యోగులకు ఐఓసీఎల్ శుభవార్త.. రూ.లక్ష వేతనంతో ఉద్యోగాలు..?

ప్రముఖ బ్యాంకులలో ఒకటైన ఐడీబీఐ బ్యాంక్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ ఉద్యోగాల భర్తీ కొరకు ఐడీబీఐ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా జనవరి 7వ తేదీలోపు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో మాత్రమే స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.

Also Read: విద్యార్థులకు డీఆర్‌డీవో శుభవార్త.. ప్రతి నెలా 15 వేలు పొందే ఛాన్స్..?

https://www.idbibank.in/index.asp వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 150 రూపాయలుగా ఉండగా ఇతరులకు 700 రూపాయలుగా ఉంది. బీఈ, బీటెక్, ఎం.ఈ, ఎంటెక్, పీజీ, ఎంసీఏ, ఎంబీఏ చదివి అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 134 ఉద్యోగాలలో మేనేజ‌ర్ (గ్రేడ్ బి) ఉద్యోగాలు – 62, ఏజీఎం (గ్రేడ్ సి) ఉద్యోగాలు 52, డీజీఎం (గ్రేడ్ డి) ఉద్యోగాలు 11, అసిస్టెంట్ మేనేజ‌ర్ (గ్రేడ్ ఏ) ఉద్యోగాలు 9 ఉన్నాయి.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హత, అనుభవం ఆధారంగా 60 వేల రూపాయల వరకు వేతనం లభిస్తుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 100 మార్కులకు పర్సనల్ ఇంటర్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో వచ్చే మార్కుల్లో మెరిట్ సాధించిన వారు ఉద్యోగాలకు ఎంపికవుతారు.