https://oktelugu.com/

ప్రభాస్‌ను కలవాలంటే 300 కోట్లు చేతిలో ఉండాల్సిందే

తెలుగు స్టార్ హీరోల్లో ప్రభాస్ స్థాయి గత మూడేళ్లలో నాలుగైదు రెట్లు పెరిగిపోయింది. ‘బాహుబలి’ సిరీస్ ఘనవిజయం అందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. ఆయన మార్కెట్ విలువ కూడ 300 కోట్లకు చేరిపోయింది. బలమైన హిట్ పడితే అది 450 నుండి 500 కోట్లకు కూడ వెళ్ళొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన సినిమాల బడ్జెట్ కూడా ఆ స్థాయిలోనే ఉంటోంది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ఒక్కసారి ప్రభాస్ చేస్తున్న […]

Written By:
  • admin
  • , Updated On : October 30, 2020 / 05:46 PM IST
    Follow us on


    తెలుగు స్టార్ హీరోల్లో ప్రభాస్ స్థాయి గత మూడేళ్లలో నాలుగైదు రెట్లు పెరిగిపోయింది. ‘బాహుబలి’ సిరీస్ ఘనవిజయం అందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. ఆయన మార్కెట్ విలువ కూడ 300 కోట్లకు చేరిపోయింది. బలమైన హిట్ పడితే అది 450 నుండి 500 కోట్లకు కూడ వెళ్ళొచ్చని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన సినిమాల బడ్జెట్ కూడా ఆ స్థాయిలోనే ఉంటోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఒక్కసారి ప్రభాస్ చేస్తున్న సినిమాలు చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న ‘రాధే శ్యామ్’ బడ్జెట్ ఇంత మొత్తమని బయటకు రాలేదు కానీ దగ్గర దగ్గర 200 కోట్ల వరకు ఉంటుందని టాక్. ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుతున్నారు. కోవిడ్ జాగ్రత్తల నడుమ జరుగుతున్న ఈ షూట్ కోసం ఒక్కో రోజుకు భారీ మొత్తంలో ఖర్చు పెడుతున్నారట. ఇక ఆయన తర్వాతి సినిమాలను చూస్తే అన్ని సినిమాల వ్యయం 400 కోట్ల పైమాటే.

    Also Read: రాహుల్ సిప్లిగంజ్ ఎమోషనల్ పోస్టు.. పునర్నవి గురించేనా?

    నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద అశ్వినీ దత్ నిర్మిస్తున్న సినిమాకు 400 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇదొక సైన్స్ ఫిక్షనల్ మూవీ. అలాగే బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి చేస్తున్న ‘ఆదిపురుష్; బడ్జెట్ కోసం 350 నుండి 400 కోట్ల వరకు ఉంటుంది. ఈ సినిమాల కోసం ప్రభాస్ తీసుకునే రెమ్యునరేషన్ ఒక్కొక్క దానికి 80 కోట్ల వరకు ఉంటుందని చెప్పుకుంటున్నారు. అంటే ప్రభాస్ తో సినిమా చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. చేతిలో మినిమమ్ 300 కోట్లు లేకుండా ఆయన్ను కలవడం కూడ అసాధ్యమన్నమాట.