https://oktelugu.com/

ఇంటర్వ్యూ : ‘ఆర్జీవీ’తో అరియానా బోల్డ్ ఆట!

‘ఆర్జీవీ’ అనే వింత జీవి, కొత్త భామ అరియానాతో చేసిన సరికొత్తగా చేసిన ఇంటర్వ్యూ మొత్తానికి రిలీజ్ అయింది. జిమ్‌ లో జరిగిన ఈ బోల్డ్‌ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫుల్‌ వీడియోని ఆర్జీవీ నెటిజన్లతో పంచుకున్నారు. అందులోని కొన్ని మీ విశేషాలు.. అరియానా : మీరు అసలు బిగ్‌ బాస్‌ చూడరు కదా. నాకోసం బిగ్‌బాస్‌ చూసి ట్వీట్‌ చేశారు? ఆర్జీవీ: నేను బిగ్‌ బాస్‌ ను సన్నీలియో కోసం చూశాను. ఆ తరువాత నీ కోసమే […]

Written By:
  • NARESH
  • , Updated On : June 19, 2021 / 08:40 PM IST
    Follow us on

    ‘ఆర్జీవీ’ అనే వింత జీవి, కొత్త భామ అరియానాతో చేసిన సరికొత్తగా చేసిన ఇంటర్వ్యూ మొత్తానికి రిలీజ్ అయింది. జిమ్‌ లో జరిగిన ఈ బోల్డ్‌ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫుల్‌ వీడియోని ఆర్జీవీ నెటిజన్లతో పంచుకున్నారు. అందులోని కొన్ని మీ విశేషాలు..

    అరియానా : మీరు అసలు బిగ్‌ బాస్‌ చూడరు కదా. నాకోసం బిగ్‌బాస్‌ చూసి ట్వీట్‌ చేశారు?
    ఆర్జీవీ: నేను బిగ్‌ బాస్‌ ను సన్నీలియో కోసం చూశాను. ఆ తరువాత నీ కోసమే చూశాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం.

    అరియానా : మీరు నాకు ఒక కాంప్లిమెంట్‌ ఇచ్చారు. దాని వల్లే పెద్ద షోలో పాల్గొన్నాను. నా సక్సెస్‌ కు థ్యాంక్యూ.
    ఆర్జీవీ: నేను నా నోటికి వచ్చింది వాగుతూ ఉంటా. నా వల్ల నీకు అవకాశం రాలేదనుకుంటా. నువ్వు నాకు థ్యాంక్స్‌ చెప్పాల్సిన అవసరం లేదు. అయినా చెబుతున్నావ్ కాబట్టి, స్వీకరిస్తున్నాను.

    అరియానా : నా తర్వాత చాలామంది అమ్మాయిలు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు. వారిలో ఎవరికీ మీరెందుకు కాంప్లిమెంట్‌ ఇవ్వలేదు ?
    ఆర్జీవీ: నాకు ఏ ఫీలింగ్‌ కలగలేదు. ఇక ఎలా కాంప్లిమెంట్స్ ఇస్తాను. కానీ నీ అందం చూసి అలా అన్నాను.

    అరియానా : మీ నుంచి ప్రశంసలు అందుకోవడానికి చాలామంది అమ్మాయిలు తాపత్రయపడుతుంటారు. అప్పుడు మీరు కృష్ణుడిలా ఫీలవుతారా?
    ఆర్జీవీ: అలా ఏమీ లేదు. నేనెప్పుడూ అలా అనుకోలేదు.

    అరియానా : మనిద్దరి మధ్య డెస్టినీ అనేది ఉందంటారా?
    ఆర్జీవీ: డెస్టినీ అనేది ఏదీ ఉండదు. మన జీవితంలో మన కంట్రోల్‌ లేకుండా ఏదో జరగడమే డెస్టినీ. అసలు ఇంటర్వ్యూలో మనిద్దరం కలుస్తామని తెలియదు. కానీ, కలిశాం. నేను అలా అంటానని నాకూ తెలియదు. ఆ సమయంలో నువ్వు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ నీకు అవకాశం తెచ్చి పెట్టింది.

    అరియానా : మీరు అమ్మాయిలను ఇంప్రెస్‌ చేయడానికి వర్కవుట్‌ చేస్తుంటారా?
    ఆర్జీవీ: నో! అమ్మాయిలను ఇంప్రెస్‌ చేయడానికి సిక్స్‌ ప్యాక్‌ చేయాలన్న ఆలోచన లాంటిది నాకు అస్సలు లేదు. అయితే, వీలైనంత ట్రిమ్‌గా ఉండాలన్న ఆలోచనతోనే నేను వ్యాయామం చేస్తా!

    అరియానా : అమ్మాయిలు చిన్న చిన్న బట్టలు వేసుకుంటే సమాజంలో వింతగా చూస్తారు! కామెంట్లు చేస్తారు. దీనిపై మీ రియాక్షన్‌?
    ఆర్జీవీ: ఎవరైతే ఇలా మాట్లాడతారో వాళ్లు అంత అందంగా లేరని అర్థం. అసలు అమ్మాయిలకు అందం అనేది ఆస్తి. ధనవంతుడికి డబ్బు ఎంత పవర్‌ ఇస్తుందో.. అమ్మాయికి అందం కూడా అంతే పవర్‌ ఇస్తుంది.

    అరియానా : ఎవరితోనైనా ఎంతకాలం రిలేషన్‌లో ఉంటారు?
    ఆర్జీవీ: ఒకప్పుడు కొన్ని సంవత్సరాలు ఉండేవాడిని. ఆ తరువాత రోజులకు వచ్చింది. ఇప్పుడు గంటల్లోకి వచ్చింది.

    అరియానా : నాలా చాలామంది అమ్మాయిలు ఒకబ్బాయిని సర్వస్వం, ప్రపంచం అనుకుంటారు. అలాంటి వాళ్లకు మీరేం చెబుతారు?
    ఆర్జీవీ: ఐదేళ్ల తర్వాత వచ్చి ‘ఆర్జీవీగారూ.. మీ మాట వినలేదు. సారీ నా ఖర్మ’ అని చెప్పకపోతే నా పేరు మార్చుకుంటా.

    అరియానా : ఆ రోజు రాకూడదని అనుకుంటున్నాను.
    ఆర్జీవీ: కచ్చితంగా ఆ రోజు వస్తుంది. ఇది బ్రహ్మంగారి జోస్యం కాదు.. ఆర్జీవీ జోస్యం.

    అరియానా : మీరు నటి అప్సరా రాణీని ఎక్కువగా ప్రమోట్‌ చేస్తున్నారు కదా. మీరు అప్సరతో రిలేషన్‌లో ఉన్నారా?
    ఆర్జీవీ: నాకు ఏవిధమైన రిలేషన్‌షిప్‌ లేదు.