హుజూరాబాద్ లో తొడగొట్టిన బీజేపీ

హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఆ సీటుకు ఫైట్ మొదలైంది. ఇప్పుడు గులాబీ దండు కూడా హుజూరాబాద్ పై దాడి చేస్తోంది. దీంతో బీజేపీ దండయాత్ర మొదలుపెట్టింది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హుజూరాబాద్ లో పర్యటించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు సపోర్టుగా రాజకీయం మొదలుపెట్టారు. దీంతో హుజూరాబాద్ వేడెక్కింది.. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నాడని […]

Written By: NARESH, Updated On : June 19, 2021 9:43 pm
Follow us on

హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఆ సీటుకు ఫైట్ మొదలైంది. ఇప్పుడు గులాబీ దండు కూడా హుజూరాబాద్ పై దాడి చేస్తోంది. దీంతో బీజేపీ దండయాత్ర మొదలుపెట్టింది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హుజూరాబాద్ లో పర్యటించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు సపోర్టుగా రాజకీయం మొదలుపెట్టారు. దీంతో హుజూరాబాద్ వేడెక్కింది..

ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నాడని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. స్వార్థం, రాజకీయ లబ్ధి కోసం ఈటల బీజేపీలో చేరలేదని క్లారిటీ ఇచ్చారు. పార్టీలో చేరేందుకు చాలా మంది స్థిరంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులను కొట్టినవాళ్లు ఇవాళా మంత్రులుగా ఉన్నారని బండి మండిపడ్డారు. వాస్తవాలను నిర్భయం చెప్పేవారికి టీఆర్ఎస్ లో స్థానం లేదన్నారు. ఉద్యమ సమయంలో చిత్తశుద్ధితో పనిచేసి వ్యక్తి ఈటల రాజేందర్ అన్నారు.

ఇక ఈటల కూడా హుజూరాబాద్ లో తొడగొట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బు, అధికారం, ప్రలోభాలకు నమ్ముకున్నారని ఈటల వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదన్నారు. సొంత పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసే దౌర్భాగ్య స్థితిలో టీఆర్ఎస్ ఉందని పేర్కొన్నారు.

మొత్తంగా ఇప్పుడు టీఆర్ఎస్ మంత్రులు హుజూరాబాద్ లో తిష్టవేయగా.. ఇప్పుడు బీజేపీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో హుజూరాబాద్ పాలిటిక్స్ వేడెక్కాయి.