https://oktelugu.com/

ప్రపంచ మెడికల్ హబ్ గా ఇండియా మారబోతుందా?

కరోనా వైరస్.. కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంలో కొన్ని దేశాలు వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాయి. Also Read: రైతు చట్టాలకు వ్యతిరేకించిన సీఎం విజయన్..! ఈక్రమంలోనే ప్రధాని మోదీ కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్ లో ప్రారంభం కాబోతుందని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 31, 2020 / 03:03 PM IST
    Follow us on

    కరోనా వైరస్.. కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంలో కొన్ని దేశాలు వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాయి.

    Also Read: రైతు చట్టాలకు వ్యతిరేకించిన సీఎం విజయన్..!

    ఈక్రమంలోనే ప్రధాని మోదీ కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్ లో ప్రారంభం కాబోతుందని ఆయన వ్యాఖ్యానించారు.

    గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఎయిమ్స్ ఆస్పత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీతోపాటు పలు సూచనలు చేశారు.

    కరోనా వ్యాక్సిన్ వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని ప్రధాని సూచించారు. ప్రజలు వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ జాగ్రత్తలు తప్పనిసరి అని తెలిపారు.

    ప్రపంచానికి భారత్ మెడికల్ హబ్ గా మారబోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మెరుగైన వైద్యం.. మెడిసిన్ అందుబాటులో ఉందని ప్రధాని స్పష్టం చేశారు.

    Also Read: కేసీఆర్‌‌ యూటర్న్‌ వెనుక అసలు కారణం అదేనా..!

    ఇదిలా ఉంటే ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ నిర్వహించింది. ఇది సక్సస్ కావడంతో మరికొన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు సిద్ధమవుతుంది.

    జనవరి 2 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిక్ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈమేరకు ఆయా రాష్ట్రాలకే కేంద్రం సమాచారం అందించింది. ఈ మాక్ డ్రిల్ తర్వాత దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ఉండనుంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్