https://oktelugu.com/

సింగిల్ డేకి 15 లక్షలు తీసుకుందట !

బబ్లీ బ్యూటీ మోనాల్ టైం నడుస్తోంది. తెలుగులో ‘సుడిగాడు’ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి’ చిత్రాల్లో హీరోయిన్ గా చేసినప్పటికీ ఈ భారీ బ్యూటీకి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, మోనాల్ గజ్జర్ కి బిగ్ బాస్ రూపంలో అదృష్టం తగిలింది. సహజంగానే బిగ్ బాస్ షో అనంతరం కంటెస్టెంట్లకు భారీ అవకాశాలు వస్తాయి, అందుకే చాలామంది హౌస్ లోకి వెళ్ళడానికి పైరవీలు చేస్తుంటారు. బబ్లీ బ్యూటీ మోనాల్ కూడా తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి పైరవీలు […]

Written By:
  • admin
  • , Updated On : December 31, 2020 / 03:06 PM IST
    Follow us on


    బబ్లీ బ్యూటీ మోనాల్ టైం నడుస్తోంది. తెలుగులో ‘సుడిగాడు’ ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి’ చిత్రాల్లో హీరోయిన్ గా చేసినప్పటికీ ఈ భారీ బ్యూటీకి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, మోనాల్ గజ్జర్ కి బిగ్ బాస్ రూపంలో అదృష్టం తగిలింది. సహజంగానే బిగ్ బాస్ షో అనంతరం కంటెస్టెంట్లకు భారీ అవకాశాలు వస్తాయి, అందుకే చాలామంది హౌస్ లోకి వెళ్ళడానికి పైరవీలు చేస్తుంటారు. బబ్లీ బ్యూటీ మోనాల్ కూడా తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి పైరవీలు చేసే వెళ్ళిందని.. ఆమెకు బిగ్ బాస్ హెడ్ తో రహస్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ ఉంది. మొత్తానికి ఏది అయితే ఏమి.. హౌస్ లోకి వెళ్లి వచ్చాకా, మోనాల్ రేంజ్ పూర్తిగా మారిపోయింది.

    Also Read: హాట్ బ్యూటీ ఏదైనా చేస్తానంటుంది.. బాలయ్య విన్నారా.. !

    ఇప్పటికే మోనాల్‌కి స్టార్ మా ఓ షో చేయమని ఆఫర్ ఇచ్చింది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో కూడా మోనాల్‌ ఆడిపాడింది. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా కోసం చాలా మంది బిగ్ బాస్ ఫ్యాన్స్ వేచి చూస్తున్నారట. అందుకే మోనాల్ కి, ఈ సాంగ్ కోసం భారీగానే ముట్టజెప్పారు. ఇంతకీ మోనాల్ తీసుకున్న రెమ్యూనరేషన్ రూ. 15 లక్షలు. అంటే కేవలం మూడు నిమిషాల పాట కోసం.. పైగా సింగిల్ డే షూట్ కోసం మోనాల్ గజ్జర్ కి ఏకంగా అంత భారీ మొత్తం ఇవ్వడానికి ఏకైక కారణం అమ్మడికి కొత్తగా వచ్చిన క్రేజే కారణం.

    Also Read: ‘పుష్ప’కు మళ్ళీ షాక్.. ఈ సారి బన్నీ నుండి !

    ఇక ఈ పాటను కోసం సారధి స్టూడియోలో ఆర్ట్ డైరెక్ట‌ర్ అవినాష్ కొల్ల సార‌థ్యంలో సెట్‌ వేసి, శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్రాఫీలో షూట్ చేశారు . జనవరి 15న ఈ సినిమా రిలీజ్ కానుంది. అన్నట్టు ‘రాక్షసుడు’ సినిమాతో మంచి హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ రెట్టించిన ఉత్సాహంతో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తోన్న ఈ సినిమా హిట్ అవ్వాలని మేకర్స్ అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాని అద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా అల్లుడు అదుర్స్ సినిమాలో మోనాల్‌ ఎంట్రీతో సినిమాకు మ‌రింత గ్లామ‌ర్ యాడ్ అయినట్టే.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్