https://oktelugu.com/

హాట్ బ్యూటీ ఏదైనా చేస్తానంటుంది.. బాలయ్య విన్నారా.. !

తనుశ్రీ దత్త అప్పట్లో హాట్ హాట్ సీన్స్ తో కుర్రకారుకు వేడిని పూటించిన హీరోయిన్. అయితే, ఈ మధ్య ఈ ముదురు భామ సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తాజాగా, మళ్ళీ మరో స్టేట్ మెంట్ తో అమ్మడు వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ, ఏమిటి అమ్మడు బాధ అంటే.. ఛాన్స్ లు కావాలట. అసలు ఇంతకీ ఈమె తెలుగులో ఎప్పుడు నటించిందనే డౌట్ వస్తోంది. కానీ తెలుగులో కూడా నటించింది. […]

Written By:
  • admin
  • , Updated On : December 31, 2020 / 02:46 PM IST
    Follow us on


    తనుశ్రీ దత్త అప్పట్లో హాట్ హాట్ సీన్స్ తో కుర్రకారుకు వేడిని పూటించిన హీరోయిన్. అయితే, ఈ మధ్య ఈ ముదురు భామ సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. తాజాగా, మళ్ళీ మరో స్టేట్ మెంట్ తో అమ్మడు వార్తల్లోకి వచ్చింది. ఇంతకీ, ఏమిటి అమ్మడు బాధ అంటే.. ఛాన్స్ లు కావాలట. అసలు ఇంతకీ ఈమె తెలుగులో ఎప్పుడు నటించిందనే డౌట్ వస్తోంది. కానీ తెలుగులో కూడా నటించింది. అప్పట్లో నందమూరి నట సింహం బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించి అలరించలేకపోయినా ఈ హాట్ బ్యూటీ.. మళ్ళీ టాలీవుడ్ కు వస్తానంటుంది.

    Also Read: నిహారిక పెళ్లి తర్వాత ప్లాన్.. దీంతో రద్దు !

    తనుశ్రీ దత్త బాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పైన సంచలన ఆరోపణలు చేసి అక్కడి సినీ ప్రముఖుల ఆగ్రహానికి గురై చివరకు అక్కడ అవకాశాలను పూర్తిగా కోల్పోయింది. దాంతో, బాలీవుడ్ లో ఆఫర్లు రాక, ప్రస్తుతం ఖాళీగా ఉండలేక ఏమైనా చేస్తానంటుంది. ఏజ్ అయిపోయినా తనది పర్ఫెక్ట్ ఫిగర్ అంటుంది. అంటే అంది, పైగా ఈ అమ్మడు ఇప్పుడు నందమూరి బాలకృష్ణ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ.. బాలయ్య కృప కోసం నానాపాట్లు పడుతుంది. బాలయ్యతో సినిమా అంటేనే ఒక ఎనర్జీ.. హీరోయిన్లను సినిమాలలో ఎంత ఆటపట్టిస్తారో.. బయట అంత రెస్పెక్ట్ ఇస్తారు అంటూ మొత్తానికి తనుశ్రీ దత్త, బాలయ్య బాబును బాగానే పొగుడుతుంది.

    Also Read: సింగర్‌‌ సునీత పెళ్లి డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడంటే..?

    మరి ఈ పొగడ్తలు బాలయ్యకు ఎప్పుడూ చేరాలి, ఆయన ఎప్పుడు ఈ బ్యూటీకి ఛాన్స్ ఇస్తారు. ఇంతకీ తెలుగులో తనుశ్రీ నటించింది వీరభద్ర సినిమాలో. 2005లో వచ్చిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఏఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి, అతి దారుణంగా నిరాశ పరిచింది. మరి తనుశ్రీ మళ్లీ నటన వైపు చూస్తుంది కాబట్టి, విలన్, అక్క, వదిన పాత్రలైన సరే చేస్తానంటుంది కాబట్టి.. మరి మేకర్స్ తనుశ్రీకి అవకాశాలు ఇస్తారేమో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్