రైతులకు అలర్ట్.. ఈ పంట పండిస్తే లక్షల్లో ఆదాయం గ్యారంటీ..?

దేశంలో రోజురోజుకు రైతులకు పంటల కోసం చేసే ఖర్చు పెరుగుతోంది. అయితే ఖర్చు పెరిగిన స్థాయిలో రైతుల ఆదాయం మాత్రం పెరగడం లేదు. దీంతో రైతులు చాలా సందర్బాల్లో నష్టపోతున్నారు. కష్టపడి పంట పండించినా పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు చెబుతూ ఉంటారు. అయితే కొన్ని పంటలు పండించడం ద్వారా రైతులు సులభంగా లక్షాధికారులు కావచ్చు. సాధారణంగా ఏ కూరగాయ ధర అయినా 100 రూపాయలు అంటే రైతులు మంచి ధర అని భావిస్తారు. […]

Written By: Navya, Updated On : November 17, 2020 6:21 pm
Follow us on


దేశంలో రోజురోజుకు రైతులకు పంటల కోసం చేసే ఖర్చు పెరుగుతోంది. అయితే ఖర్చు పెరిగిన స్థాయిలో రైతుల ఆదాయం మాత్రం పెరగడం లేదు. దీంతో రైతులు చాలా సందర్బాల్లో నష్టపోతున్నారు. కష్టపడి పంట పండించినా పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు చెబుతూ ఉంటారు. అయితే కొన్ని పంటలు పండించడం ద్వారా రైతులు సులభంగా లక్షాధికారులు కావచ్చు.

సాధారణంగా ఏ కూరగాయ ధర అయినా 100 రూపాయలు అంటే రైతులు మంచి ధర అని భావిస్తారు. అయితే ఒక పంటను పండిస్తే మాత్రం కిలో మూడు లక్షల రూపాయలకు పైగా అమ్మవచ్చు. కుంకుమ పువ్వును పండిస్తే కిలో 3 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. కుంకుమ పువ్వు ధర ఇంత పలకడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఈ పంటను ఎక్కడ పడితే అక్కడ పండించడం సాధ్యం కాదు.

భారతదేశంలోని జమ్మూకాశ్మీర్ పర్వతాలలో మాత్రమే ఈ పంటను పండించడం సాధ్యమవుతుంది. పొలాల్లో కుంకుమ పువ్వు మొక్కలను నాటి ఆ మొక్కకు పూచిన పూల నుంచి కుంకుమ పువ్వును తయారు చేస్తారు. మన దేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా కుంకుమ పువ్వు మొక్కలకు అత్యంత ఖరీదైన మొక్కలుగా పేరుంది. 80,000 కుంకుమ పువ్వులతో కేవలం అర కేజీ కుంకుమ పువ్వు తయారవుతుంది.

అందువల్లే కుంకుమపువ్వు చెట్లకు, కుంకుమ పువ్వుకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఉంటుంది. కుంకుమ పువ్వును ఔషధాల తయారీలో, కొన్ని ప్రత్యేకమైన ఆహారాల తయారీలో కూడా వినియోగిస్తారు. రెడ్ గోల్డ్ అని పిలిచే కుంకుమ పువ్వును పండిస్తే మాత్రం రైతులు లక్షాధికారులు కావడం గ్యారంటీ.