https://oktelugu.com/

విజయ్ దేవరకొండ… గొప్ప తెలివి ఉన్న హీరో !

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నిజంగా గొప్ప తెలివి ఉన్న హీరోనే. ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా అతి తక్కువ టైంలో ఈ రేంజ్ కి రావడం అంటే మాటలా..? ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఇంకా ఎదగడానికి చాలా ప్లాన్డ్ గా కెరీర్ ను సెట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు విజయ్. మొదటి నుండి కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు.. ఇప్పుడు అదే జాగ్రత్తను జీవితంలోనూ చూపిస్తున్నాడు. డబ్బు సంపాదిస్తేనే గౌరవం, మంచి లైఫ్ దక్కుతాయనేది […]

Written By:
  • admin
  • , Updated On : November 17, 2020 / 07:00 PM IST
    Follow us on


    క్రేజీ హీరో విజయ్ దేవరకొండ నిజంగా గొప్ప తెలివి ఉన్న హీరోనే. ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా అతి తక్కువ టైంలో ఈ రేంజ్ కి రావడం అంటే మాటలా..? ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఇంకా ఎదగడానికి చాలా ప్లాన్డ్ గా కెరీర్ ను సెట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు విజయ్. మొదటి నుండి కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు.. ఇప్పుడు అదే జాగ్రత్తను జీవితంలోనూ చూపిస్తున్నాడు. డబ్బు సంపాదిస్తేనే గౌరవం, మంచి లైఫ్ దక్కుతాయనేది ఎప్పుడూ చెబుతూ ఉండే విజయ్.. డబ్బును ఇంకా సంపాదించడానికి అన్ని రకాలుగా ఆలోచిస్తూ దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వాడుకుని బిజినెస్ మెన్ గానూ పైకి ఎదగడానికి పక్కా వ్యూహంతో వెళ్తున్నాడు.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ విలన్ ట్రాక్ ఇదే !

    అందుకే సినిమాలతో పాటే వ్యాపార రంగంలోనూ భారీ పెట్టుబడులు పెడుతున్నాడు. ఇప్పటికే రౌడీ అనే బ్రాండ్ పేరుతో సొంతగా ఆన్ లైన్ వస్త్ర వ్యాపారం చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఆ వ్యాపారంలో ఆల్ రెడీ లాభాల్లో ఉన్నాడు. రౌడీ బ్రాండ్ కి ఇప్పటికే రెగ్యులర్ కస్టమర్లు లక్షల్లో ఉన్నారు. అందుకే విజయ్ ఇప్పుడు మరో కొత్త వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాడు. హైదరాబాద్‌కు చెందిన వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీలో విజయ్ పెట్టుబడులు పెట్టారు. నిజానికి గతంలోనే విజయ్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినా.. ప్రస్తుతం భారీ మొత్తాన్ని మళ్లీ ఇన్వెస్ట్ చేశాడట. భవిష్యత్తు ఈ ఎలక్ట్రిక్ వాహనాలదే అని నమ్మిన విజయ్, మొత్తానికి ఈ వ్యాపారం మీద భారీగానే పెట్టుబడులు పెడుతున్నాడు.

    Also Read: పాపం బోయపాటి.. మళ్లీ మొదటికొచ్చింది !

    మరి వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్ కంపెనీలో విజయ్ భాగస్వామి అయ్యాడు కాబట్టి.. రేపోమాపో ఈ కంపెనీ కోసం ఓ యాడ్ ను చేసే ఆలోచన కూడా చేస్తాడు. అన్నట్లు.. భవిష్యత్తులో ఈ కంపెనీకి చెందిన వాహనాలు హైదరాబాద్ లో అందుబాటులోకి రాబోతున్నాయి. పైగా తక్కువ అద్దెతోనే ఈ వాహనాలను రెంట్ కు కూడా తీసుకోవచ్చు అట. రెంట్ కి అంటే.. చాలామంది కుర్రాళ్ళు ఆసక్తి చూపించొచ్చు. ఇక విజయ్ త్వరలోనే మియాపూర్ రోడ్ లో పిల్లలు ఆడుకునే ఓ ఎంటర్ టైన్మెంట్ వరల్డ్ ను స్టార్ట్ చేస్తాడట. ఎలాగూ ప్రస్తుతం విజయ్ దేవరకొండకు ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఇప్పటికే ఒక సినిమాని నిర్మించాడు. తన బ్యానర్ లో మరో రెండు వెబ్ సిరీస్ లను నిర్మించే ప్లాన్ లో ఉన్నాడు. ఏది ఏమైనా.. విజయ్ దేవరకొండ గొప్ప తెలివి ఉన్న హీరో.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్