https://oktelugu.com/

వాహనదారులకు ఆలర్ట్.. ఈ డాక్యుమెంట్ లేకపోతే రూ. 10,000 జరిమానా..?

చాలా సందర్భాల్లో వాహనదారులు చేసే చిన్నచిన్న పొరపాట్లు వాళ్లు ఎక్కువ మొత్తం జరిమానా చెల్లించడానికి కారణమవుతూ ఉంటాయి. అయితే ట్రాఫిక్ నిబంధనల గురించి సరైన అవగాహనను ఏర్పరచుకుంటే జరిమానా నుంచి తప్పించుకోవడంతో పాటు సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. బైక్, స్కూటర్, కార్లలో ప్రయాణించే వాహనదారులు ఒక డాక్యుమెంట్ లేకపోతే మాత్రం ఏకంగా 10,000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ ఉంటే మాత్రమే ఈ జరిమానా నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పటికే పొల్యూషన్ అండర్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 2, 2020 / 03:49 PM IST
    Follow us on


    చాలా సందర్భాల్లో వాహనదారులు చేసే చిన్నచిన్న పొరపాట్లు వాళ్లు ఎక్కువ మొత్తం జరిమానా చెల్లించడానికి కారణమవుతూ ఉంటాయి. అయితే ట్రాఫిక్ నిబంధనల గురించి సరైన అవగాహనను ఏర్పరచుకుంటే జరిమానా నుంచి తప్పించుకోవడంతో పాటు సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. బైక్, స్కూటర్, కార్లలో ప్రయాణించే వాహనదారులు ఒక డాక్యుమెంట్ లేకపోతే మాత్రం ఏకంగా 10,000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

    పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ ఉంటే మాత్రమే ఈ జరిమానా నుంచి తప్పించుకోవచ్చు. ఇప్పటికే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ ఉన్న వాహనదారులు సైతం ఆ సర్టిఫికెట్ కు సంబంధిన వాలిడిటీ ను చెక్ చేసుకుంటూ ఉండాలి. గడువు దాటిన సర్టిఫికెట్ ఉన్నా ఆ సర్టిఫికెట్ వల్ల ఎటువంటి ప్రయోజనం చేకూరదు. కేంద్రం గతేడాది మోటార్ వెహికల్ చట్టంలో కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే.

    కేంద్రం చేసిన ఈ మార్పుల వల్ల గతంలో పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ కు 1000 రూపాయలుగా ఉన్న జరిమానా 10,000కు పెరిగింది. సర్టిఫికెట్ లేని వాళ్లు వెంటనే పొల్యూషన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసి సర్టిఫికెట్ ను పొందితే మంచిది. కాలుష్య నిబంధనలను అనుగుణంగా ఉన్న వాహనాలు పీయూసీ సర్టిఫికెట్ ను సులువుగా పొందవచ్చు. వాహనం రోడ్డుపై తిరుగుతుందంటే ఈ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి.

    వాహనం కొనుగోలు చేసిన 12 నెలల తరువాత పీయూసీ సర్టిఫికెట్ ను పొందాల్సి ఉంటుంది. ఆ తరువాత పీయూసీ సర్టిఫికెట్ ను రెన్యూవల్ చేసుకోవాలి. పీయూసీ సర్టిఫికెట్ ఉన్న వాహనాలు మాత్రమే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి అర్హత పొందుతాయి. ఇప్పటివరకు ఈ సర్టిఫికెట్ మీ దగ్గర లేకపోతే వెంటనే దరఖాస్తు చేస్తే మంచిది.