https://oktelugu.com/

ప్లేఆఫ్స్‌ రేసులో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిలిచేనా..!

ఐపీఎల్‌ 2020 సీజన్‌ రసవత్తరంగా నడుస్తోంది. ఏ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుతుందో కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటే ముంబయి జట్టు ప్లేఆఫ్‌కు చేరుకొని తన స్థానాన్ని పదిలిపరుచుకోగా.. మిగితా జట్లు ప్లేఆఫ్స్‌కు చేరేందుకు చెమటోడుస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే రేసు నుంచి తప్పుకోగా.. ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్లో అనూహ్యంగా ధోనీ సేన గెలుపొందడంతో లెక్కలు మారాయి. సీఎస్‌కే పోతూ పోతూ.. పంజాబ్ జట్టును కూడా తన వెంట తీసుకెళ్లింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 2, 2020 / 03:52 PM IST
    Follow us on

    ఐపీఎల్‌ 2020 సీజన్‌ రసవత్తరంగా నడుస్తోంది. ఏ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుతుందో కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటే ముంబయి జట్టు ప్లేఆఫ్‌కు చేరుకొని తన స్థానాన్ని పదిలిపరుచుకోగా.. మిగితా జట్లు ప్లేఆఫ్స్‌కు చేరేందుకు చెమటోడుస్తున్నాయి.

    చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే రేసు నుంచి తప్పుకోగా.. ఆదివారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్లో అనూహ్యంగా ధోనీ సేన గెలుపొందడంతో లెక్కలు మారాయి. సీఎస్‌కే పోతూ పోతూ.. పంజాబ్ జట్టును కూడా తన వెంట తీసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం జరిగిన మరో మ్యాచ్‌లో  కోల్‌కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి.. ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. ఇక రాజస్థాన్ రాయల్స్ కూడా రేసు నుంచి తప్పుకున్నట్టే. ఇక మిగిలినవి అయిదు జట్లు. ప్లే ఆఫ్స్ వెళ్లాల్సింది నాలుగు టీమ్‌లే. ప్లే ఆఫ్స్ రేసు నుంచి బయటపడే ఆ ఒక్కటీ ఏదనేది ఉత్కంఠకు గురి చేస్తోంది.

    ఢిల్లీ కేపిటల్స్, బెంగళూరు జట్లు ఈ సాయంత్రం తలపడబోతున్నాయి. ఈ రెండింట్లో ఏ జట్టు గెలిచినా ప్లేఆఫ్స్ ప్లేస్‌ను ఖాయం చేసుకుంటుంది. ఈ రెండింటి అకౌంట్‌లో చెరో 14 పాయింట్లు ఉన్నాయి. ప్లేఆఫ్స్ చేరడానికి ఇంకో రెండు పాయింట్లు అవసరం. ఆ రెండు పాయింట్ల కోసం ఈ సాయంత్రం పోరాడబోతున్నాయి. గెలిచిన టీమ్ నేరుగా ప్లేఆఫ్స్ కు  చేరుకుంటుంది. ఓడిన టీమ్ కూడా రేసులోనే ఉంటుంది. కానీ అది తర్వాత జరిగే మ్యాచ్ మీద ఆధారపడి ఉంటుంది. ప్లేఆఫ్స్ నిలవాలి అంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో మంగళవారం ఆడబోతోంది వార్నర్ సేన. అన్ని విభాగాల్లోనూ తన కంటే బలమైన ముంబై ఇండియన్‌ను ఢీ కొట్టబోతోంది. ఈ సీజన్ లీగ్ దశలో ఇదే చివరి మ్యాచ్. ఇందులో గెలిస్తే సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ రేస్‌లో నిలుస్తుంది. అదే సమయంలో ఢిల్లీ కేపిటల్స్.. రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే మ్యాచ్‌లో ఆ జట్లు సాధించే నెట్ రన్‌రేట్ ప్రభావం చూపుతుంది.

    మంగళవారం జరిగే గేమ్-2లో హైదరాబాద్ జట్టు ముంబైపై విజయం సాధిస్తే కోల్‌కతా  నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్ నుంచి వైదొలగుతుంది. ముంబై ఇండియన్స్ చేతిలో సన్ రైజర్స్ ఓడిపోతే..ఈక్వేషన్లతో పెద్దగా పని ఉండదు. హైదరాబాద్ కంటే రెండు పాయింట్లు ఎక్కువే సాధించిన కోల్ కతా ఆటోమెటిక్‌గా ప్లేఆఫ్స్ చేరుకుంటుంది.