టీఆర్ఎస్ గెలిస్తే మేయర్ పీఠం రెడ్డిలకే? ఆమెనా?

జీహెచ్ఎంసీలో వాయిదా పడిన ఓల్డ్ మలక్ పేట పోలింగ్ ఈరోజు జరుగుతోంది. అది పూర్తయ్యాక సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తుతాయి. ఆంధ్రా ఓటర్లు, యువత, ఉద్యోగులు ఈ ఓటింగ్ కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అసలైన తెలంగాణ బస్తీ వాసులే ఓటేసినట్టు పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతోంది. Also Read: గ్రేటర్లో పోలింగ్ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసా? అయితే ఎక్స్ ఆఫీషియో దాదాపు 40 వరకు ఉండడంతో టీఆర్ఎస్ కే మేయర్ పీఠం ఖాయం […]

Written By: NARESH, Updated On : December 3, 2020 10:17 am
Follow us on

జీహెచ్ఎంసీలో వాయిదా పడిన ఓల్డ్ మలక్ పేట పోలింగ్ ఈరోజు జరుగుతోంది. అది పూర్తయ్యాక సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తుతాయి. ఆంధ్రా ఓటర్లు, యువత, ఉద్యోగులు ఈ ఓటింగ్ కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అసలైన తెలంగాణ బస్తీ వాసులే ఓటేసినట్టు పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతోంది.

Also Read: గ్రేటర్లో పోలింగ్ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసా?

అయితే ఎక్స్ ఆఫీషియో దాదాపు 40 వరకు ఉండడంతో టీఆర్ఎస్ కే మేయర్ పీఠం ఖాయం అన్నది తెలిసిందే. ఈ క్రమంలోనే మేయర్ పదవి రెడ్డి సామాజికవర్గానికి కేటాయించాలని టీఆర్ఎస్ అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం.

జనరల్ మహిళ అనేది రిజర్వేషన్ రావడం గగనమని.. ఈ క్రమంలోనే ఈసారి తెలంగాణలోనే బలమైన సామాజికవర్గమైన రెడ్డిలకే ఈ మేయర్ పీఠం ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు సమాచారం.

బుధవారం సాయంత్రానికి గ్రేటర్ పోలింగ్ శాతంపై తుది రిపోర్ట్ రానుంది. ఆ తర్వాత పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ వెల్లువెత్తుతాయి. టీఆర్ఎస్ వేవ్ కనిపిస్తుండడంతో విజయంపై టీఆర్ఎస్ ధీమాగా ఉంది.

Also Read: బస్తీల్లో అధికశాతం ఓటింగ్ దేనికి సంకేతం?

గతంలో బీసీ జనరల్ కు రిజర్వేషన్ ఖాయం కావడంతో బొంతు రామ్మోహన్ కు మేయర్ పదవి దక్కింది. ఈసారి జనరల్ మహిళ కావడంతో ఎవరికి ఇస్తారనే ఉత్కంఠ నెలకొంది. జనరల్ కావడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీలు పోటీపడవచ్చు. కానీ రాకరాక వచ్చే జనరల్ కేటగిరి కావడంతో టీఆర్ఎస్ అధిష్టానం గుర్రుగా ఉన్న బలమైన రెడ్డి వర్గానికే ఈసారి పీఠం ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

ప్రధానంగా ఇప్పుడు టీఆర్ఎస్ లో మేయర్ పీఠం కోసం డజను మంది వరకు పోటీలో ఉన్నారు. ఎక్కువగా అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల భార్యలు, కోడళ్లు ఇందుకోసం పోటీపడుతున్నారు. అందరిలోకి టీఆర్ఎస్ మేయర్ రేసు లో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు సునరితారెడ్డి (మూసారాంబాగ్) మేయర్ పీఠం కోసం ప్రథమ పోటీదారుగా ఉన్నారని సమాచారం. ఇప్పటికే ఆమె గెలుపు కోసం డివిజన్లో శాయశక్తులు ఒడ్డారు. మేయర్ సీటు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్