‘వదినమ్మ’ రాక కోసమే బిగ్ బాస్ టైమ్ మారింది !

బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ప్రసార సమయాల్లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. అయితే స్టార్ మా ఛానల్‌లో రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతున్న ‘వదినమ్మ’ సీరియల్ కోసమే బిగ్ బాస్ టైం మార్చబోతుండటం విశేషం. ఎలాగూ డిసెంబర్ 20 నాటితో బిగ్ బాస్ ఈ సీజన్‌కి ముగింపుపలకబోతున్నారు కాబట్టి.. పైగా చివరి వారాల్లో కాస్త ఇంట్రస్ట్ ఉంటుంది కాబట్టి.. ఒక అరగంట అటు ఇటైనా చూసేవాళ్లు ఎలాగూ చూస్తారు. వ్యూవర్ […]

Written By: admin, Updated On : December 3, 2020 9:53 am
Follow us on


బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ప్రసార సమయాల్లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. అయితే స్టార్ మా ఛానల్‌లో రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతున్న ‘వదినమ్మ’ సీరియల్ కోసమే బిగ్ బాస్ టైం మార్చబోతుండటం విశేషం. ఎలాగూ డిసెంబర్ 20 నాటితో బిగ్ బాస్ ఈ సీజన్‌కి ముగింపుపలకబోతున్నారు కాబట్టి.. పైగా చివరి వారాల్లో కాస్త ఇంట్రస్ట్ ఉంటుంది కాబట్టి.. ఒక అరగంట అటు ఇటైనా చూసేవాళ్లు ఎలాగూ చూస్తారు. వ్యూవర్ షిప్‌లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. అందుకే బిగ్ బాస్ టైంలో మార్పులు చేశారు బిగ్ బాస్ టీమ్.

Also Read: ‘సలార్’గా రాబోతున్న ప్రభాస్.. ఫ్యాన్స్ ఖుషీ..!

దీనికితోడు ఈ మధ్య కార్తీకదీపం లాంటి మెగా సీరియల్స్ లో పస తగ్గడంతో వదినమ్మ సీరియల్ విపరీతంగా పుంజుకుందట. లాక్ డౌన్ తరువాత వదినమ్మకి రేటింగ్ టాప్ లో వస్తోందని తెలుస్తోంది. ఈ సీరియల్‌ని ప్లైమ్ టైంలో వేస్తే ఇంకా రేటింగ్ పెరిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశ్యంతోనే బిగ్ బాస్ ను కూడా పక్కన పెట్టి.. వదినమ్మను ముందుకు తీసుకువచ్చారు. ఇక రోజురోజుకూ బిగ్ బాస్ లాంగ్ రన్‌లో రేటింగ్ లెక్కలు తగ్గిపోతున్నాయి. ఇవ్వన్నీ అంచనా వేసుకునే బిగ్ బాస్, వదినమ్మ టైమింగ్‌లో మార్పులు చేశారు.

Also Read: వైరల్ అవుతోన్న పవన్ ఫ్యామిలీ ఫోటో !

కాగా తాజా సమాచారం ప్రకారం.. డిసెంబర్ 7 నుంచి ఈ మార్పులు అమలవ్వనున్నాయి. కాగా బిగ్ బాస్ షో సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 10 గంటలకు ప్రసారం కానుంది. ఇక శని-ఆదివారానికి సంబంధించి బిగ్ బాస్ ప్రసారాల్లో ఎలాంటి మార్పులు ఉండవు అట. యాదావిదిగా రాత్రి 9 గంటలకు బిగ్ బాస్ షో ప్రసారం కానుంది. అంటే బిగ్ బాస్ షో టైంలో వదినమ్మ సీరియల్ రాత్రి 9.30 గంటలకు మెగా సీరియల్ గా ప్రసారం అవ్వనుంది. మొత్తానికి వదినమ్మ సీరియల్ పూర్తైన తరువాతే బిగ్ బాస్ ప్రసారం కానున్నాడు. ఇక రాత్రి 7 గంటలకు వదినమ్మ సీరియల్ టైంలో ‘గుప్పెడంత మనసు’ అనే మరో కొత్త సీరియల్ ప్రసారం కాబోతుందని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్