https://oktelugu.com/

ట్రైలర్ టాక్: ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ థ్రిల్లింగ్ రైడ్

‘అల వైకుంఠపురంలో’ ఓ మంచి పాత్రలో మెప్పించిన అక్కినేని హీరో అఖిల్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ హీరోగా మరో ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా అతడు చేసిన ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా అక్కినేని హీరో సుశాంత్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఇచ్చట వాహనాలు నిలుపురాదు’ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ ఆసక్తి రేపుతోంది. సుశాంత్ తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను తన […]

Written By:
  • NARESH
  • , Updated On : January 29, 2021 / 10:45 AM IST
    Follow us on

    ‘అల వైకుంఠపురంలో’ ఓ మంచి పాత్రలో మెప్పించిన అక్కినేని హీరో అఖిల్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ హీరోగా మరో ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా అతడు చేసిన ‘ఇచ్చట వాహనాలు నిలుపరాదు’ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది.

    రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా అక్కినేని హీరో సుశాంత్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఇచ్చట వాహనాలు నిలుపురాదు’ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ ఆసక్తి రేపుతోంది. సుశాంత్ తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను తన తల్లి, ప్రేయసిపై ఉన్న ప్రేమ కంటే కూడా ఎక్కువగా ఆరాధిస్తాడు. బైక్ కోసం వారిద్దరినీ కూడా దూరం పెడుతాడు.

    అయితే ఓ రాజకీయ నాయకుడి పెద్ద ర్యాలీ జరిగే పార్కింగ్ జోన్ వద్ద తన డ్రీం బైక్‌ను పార్క్ చేసినప్పుడు వివాదం చెలరేగి కథ మొత్తం మారిపోతుంది. ఈ క్రమంలోనే ఏం జరిగింది? సుశాంత్ కు, విలన్ బ్యాచ్ మధ్య పెద్ద పోరాటానికి దారితీసే బైక్ పార్కింగ్ లో అసలేం జరిగింది? ఆ బైక్ ను విలన్లు ఎందుకు పాడు చేశారన్నది అసలు కథగా ఉంది.

    ఈ సినిమాలో కమెడియన్ వెన్నెలా కిషోర్ కామెడీ నవ్వించేలా కనిపిస్తోంది. ఉత్కంఠ రేపేలా ఈ కథను తయారు చేసినట్టు తెలుస్తోంది. కథాంశం ఆసక్తికరంగా అనిపిస్తుంది. టీజర్ బాగా కట్ చేశారు.

    హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ చిత్రానికి ఎస్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. శాస్త్రా మూవీస్ సహకారంతో ఎ 1 స్టూడియోస్ నిర్మిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.