https://oktelugu.com/

మెడ పట్టేసిందా.. నొప్పి నివారణకు పాటించాల్సిన చిట్కాలివే..?

మనలో చాలామందికి ఏదో ఒక సందర్భంలో మెడ పట్టేయడం జరుగుతుంది. మెడ పట్టేయడం వల్ల చాలామంది నిద్రపోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. చిన్న సమస్యే అయినా మెడ కండరాలపై ఒత్తిడి పడితే మెడ పట్టేయడం జరుగుతుంది. కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం గడిపేవారిని ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. చాలామంది తల దిండు తీసేసి నిద్రిస్తే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని భావిస్తారు. Also Read: తరచూ కోపం వస్తోందా.. మీలో ఈ సమస్య ఉన్నట్టే..? కొన్ని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 29, 2021 3:29 pm
    Follow us on

    Neck Pain

    మనలో చాలామందికి ఏదో ఒక సందర్భంలో మెడ పట్టేయడం జరుగుతుంది. మెడ పట్టేయడం వల్ల చాలామంది నిద్రపోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. చిన్న సమస్యే అయినా మెడ కండరాలపై ఒత్తిడి పడితే మెడ పట్టేయడం జరుగుతుంది. కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం గడిపేవారిని ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. చాలామంది తల దిండు తీసేసి నిద్రిస్తే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని భావిస్తారు.

    Also Read: తరచూ కోపం వస్తోందా.. మీలో ఈ సమస్య ఉన్నట్టే..?

    కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మెడనొప్పి సమస్య దూరమవుతుంది. సున్నితమైన మసాజ్ ద్వారా మెడ నొప్పి సమస్య దూరమవుతుంది. వేడి నీటితో స్నానం చేసి నొప్పి ఉన్నచోట వేడి చేసిన ఆవాల నూనె, కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే మెడ నొప్పి తగ్గుతుంది. నిటారుగా కూర్చుని తలను పైకి, కిందికి కదపడం ద్వారా కూడా సమస్య దూరమవుతుంది. పలుచని టవల్ లో ఐస్ ముక్కలను ఉంచి మెడ పట్టేసిన ప్రాంతంలో అదిమి పట్టుకుంటే మెడి నొప్పి సమస్య దూరమవుతుంది.

    Also Read: రాత్రి 8 తర్వాత ఆహారం తీసుకుంటే కలిగే నష్టాలివే..?

    ఈ చిట్కాలు పాటించినా మెడ నొప్పి తగ్గకపోతే హీటింగ్ ప్యాడ్ ను వినియోగించాలి. పాలలో పసుపు వేసి రోజుకు రెండుసార్లు తాగినా మంచి ఫలితం ఉంటుంది. మెడ నొప్పి తగ్గేవరకు టర్కీ టవల్‌ ను రోల్ చేసుకుని మెడ కింద సపోర్ట్ గా వినియోగించాలి. భుజాల వరకు తలగడనే లాగి పడుకుంటే మంచిది. తలగడను భుజాలకు కూడా సపోర్ట్ ఇచ్చే విధంగా ఉంచుకోవడం ద్వారా తక్కువ సమయంలోనే మెడనొప్పి సమస్య దూరమవుతుంది.

    మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

    మెడ పట్టేసిన సమయంలో కుడి చేతితో లేదా ఎడమ చేతితో అధిక బరువులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తకూడదు. సెలూన్ షాపులలో మెడను కటకటమని శబ్దం వచ్చే విధంగా కొందరు తిప్పిస్తుంటారు. ఈ పద్ధతి వల్ల నష్టమే తప్ప ఎటువంటి లాభం ఉండదు. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే పారాసిటమల్ వినియోగించడం అప్పటికీ నొప్పి తగ్గకపోతే డాక్టర్ ను సంప్రదించడం చేయాలి.