మెగాస్టార్‌‌ మద్దతూ మా కూటమికే..: సోము కీలక వ్యాఖ్యలు

మెగాస్టార్‌‌ చిరంజీవి.. కేంద్ర మాజీ మంత్రి. ఆయన ఇప్పుడు రాజకీయాలను వదిలి సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు మరో ఆసక్తికర అంశం ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. మెగాస్టార్‌‌ చిరంజీవి రాబోయే ఎన్నికట్లో బీజేపీ–జనసేన కూటమికి అండగా ఉంటారని. కొద్ది రోజులుగా ఈ వార్తలు వినిపిస్తున్నా.. తాజాగా మరోసారి క్లారిటీ వచ్చినట్లయింది. తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు రాజకీయంగా సహకారం అందించడానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నారంటూ కొద్దిరోజుల కిందటే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ […]

Written By: Srinivas, Updated On : January 29, 2021 10:47 am
Follow us on


మెగాస్టార్‌‌ చిరంజీవి.. కేంద్ర మాజీ మంత్రి. ఆయన ఇప్పుడు రాజకీయాలను వదిలి సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు మరో ఆసక్తికర అంశం ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. మెగాస్టార్‌‌ చిరంజీవి రాబోయే ఎన్నికట్లో బీజేపీ–జనసేన కూటమికి అండగా ఉంటారని. కొద్ది రోజులుగా ఈ వార్తలు వినిపిస్తున్నా.. తాజాగా మరోసారి క్లారిటీ వచ్చినట్లయింది. తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు రాజకీయంగా సహకారం అందించడానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నారంటూ కొద్దిరోజుల కిందటే జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు మరో ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో చిరంజీవి తమ కూటమి వెంటే ఉంటారని తేల్చి చెప్పారు.

Also Read: అయ్య‘బాబో’య్.. అంటున్న జనం.!

2024లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల నాటికి బీజేపీ-–జనసేన కూటమికి చిరంజీవి మద్దతు ఇస్తారని స్పష్టం చేశారు. ఆయన అండదండలతో రాష్ట్రంలో తమ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, తమ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. చిరంజీవి మద్దతుతో 2024 ఎన్నికల అనంతరం రాష్ట్రంలో జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో తమ కూటమికి మరిన్ని రాజకీయ పక్షాలు, సంఘాల నుంచి మద్దతు లభిస్తుందని, అవి ఏమిటనేవి ఇప్పుడే వివరించలేమని సోము వీర్రాజు అన్నారు.

కొద్ది రోజుల్లో జరగబోతున్న పంచాయతీ ఎన్నికల అనంతరం ఏపీలో బీజేపీ–జనసేన కూటమిలు బలపడుతాయని వీర్రాజు చెప్పారు. దీనికి అనుగుణంగా తాము వ్యూహాలను రూపొందించుకుంటున్నామని, ఎన్నికల్లో పోటీ చేయడానికి యువతకు ప్రాధాన్యమిస్తామని అన్నారు. తాము అధికారంలోకి రావాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారనే విషయం పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమౌతుందని సోమువీర్రాజు చెప్పారు. పంచాయతీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడాన్ని తాము సమర్థించట్లేదని స్పష్టం చేశారు. బలవంతపు ఏకగ్రీవాల కోసం అధికార పార్టీ కుట్ర పన్నుతోందని విమర్శించారు.

Also Read: చంద్రబాబును జగన్ ఎందుకు అంతలా కలవరిస్తున్నారు?

అంతేకాదు.. ఆన్‌లైన్ ద్వారా నామినేషన్లను దాఖలు చేయడానికి అవకాశం కల్పించాలనే విషయాన్ని తాము ప్రతిపాదించామని, దీన్ని ఓ ఉద్యమంలా తీసుకెళ్తామని అన్నారు. గతేడాది రద్దయిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు అనేక చోట్ల దౌర్జన్యాలకు పాల్పడ్డారని, నామినేషన్ పత్రాలను చించేశారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండటానికే ఆన్‌లైన్ ద్వారా నామినేషన్లను దాఖలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని సోము చెప్పారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్