చేతిలో ఎక్కువ మొత్తంలో డబ్బు ఉండే రిస్క్ లేకుండా ఆదాయం పొందాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ స్కీమ్స్ ఉత్తమమని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ ద్వారా సులభంగా కచ్చితమైన రాబడిని పొందే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ స్కీమ్స్ లో దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా లక్షాధికారులు అయ్యే అవకాశం ఉంటుంది. 5 ఏళ్ల నుంచి 15 ఏళ్లు పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు.
Also Read: సుకన్య సమృద్ధి ఖాతా ఉందా.. బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే..?
టైమ్ డిపాజిట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, రికరింగ్ డిపాజిట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లలో పెట్టుబడులు పెడితే ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో పెట్టుబడులు పెడితే 7.1 శాతం వడ్డీని పొందే అవకాశం ఉంటుంది. ఎన్ఎస్‌సీ స్కీమ్ లో డిపాజిట్ చేస్తే 6.8 శాతం వడ్డీని పొందవచ్చు. టైమ్ స్కీమ్ లో డిపాజిట్ చేయడం ద్వారా 6.7 శాతం వడ్డీ పొందే అవకాశం ఉంటుంది.
Also Read: కిసాన్ క్రెడిట్ కార్డ్ కావాలా.. కార్డును ఎలా పొందవచ్చంటే..?
రికరింగ్ డిపాజిట్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా 5.8 శాతం వడ్డీని పొందవచ్చు. పోస్టాఫీస్ ల ద్వారా మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, సుకన్య స్కీమ్ లలో కూడా ఇన్వెస్ట్ చేసి ఎక్కువ మొత్తం ప్రయోజనాలు పొందవచ్చు. పీపీఎఫ్ ఖాతాలో నెలకు 1,000 రూపాయల చొప్పున డిపాజిట్ చేసినా కాల పరిమితిని బట్టి 3 లక్షల రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. పోస్టాఫీస్ స్కీమ్ లలో 15 సంవత్సరాల వరకు డిపాజిట్ చేయవచ్చు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
సమీపంలోని పోస్టాఫీస్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. సురక్షితమైన పెట్టుబడుల కోసం పోస్టాఫీస్ లు బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.