https://oktelugu.com/

జీహెచ్ఎంసీలో హంగ్.. మేయర్ పీఠం ఎవరికి?

గ్రేటర్ ఓటరు ఈసారి ఏ పార్టీని ఆదరించలేదు. తన మద్దతును తలా కొంత పంచాడు. అధికార టీఆర్ఎస్ కు షాకిచ్చాడనే చెప్పాలి. పూర్తి స్థాయి మెజారిటీ ఇవ్వకుండా బీజేపీకి సరిసమాన సీట్లు ఇచ్చి జలక్ ఇచ్చాడు. Also Read: టీఆర్ఎస్ వెంటే ఆంధ్రా ఓటర్లు..! తెలంగాణలో ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఏదో ఒక పార్టీకే పట్టం కట్టారు. కానీ దుబ్బాక ఫలితం నుంచి సీన్ మారుతోంది. దుబ్బాకలో కేవలం వెయ్యికి పైగా ఓట్లతోనే […]

Written By:
  • NARESH
  • , Updated On : December 4, 2020 / 07:16 PM IST
    Follow us on

    గ్రేటర్ ఓటరు ఈసారి ఏ పార్టీని ఆదరించలేదు. తన మద్దతును తలా కొంత పంచాడు. అధికార టీఆర్ఎస్ కు షాకిచ్చాడనే చెప్పాలి. పూర్తి స్థాయి మెజారిటీ ఇవ్వకుండా బీజేపీకి సరిసమాన సీట్లు ఇచ్చి జలక్ ఇచ్చాడు.

    Also Read: టీఆర్ఎస్ వెంటే ఆంధ్రా ఓటర్లు..!

    తెలంగాణలో ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఏదో ఒక పార్టీకే పట్టం కట్టారు. కానీ దుబ్బాక ఫలితం నుంచి సీన్ మారుతోంది. దుబ్బాకలో కేవలం వెయ్యికి పైగా ఓట్లతోనే బీజేపీ అభ్యర్థి గెలిచాడు. ఇప్పుడు హైదరాబాదీ ఓటరు ఏకంగా హంగ్ ఇచ్చాడు. ఏ పార్టీకి మెజార్టీ ఇవ్వకుండా డోలాయమానంలోకి నెట్టాడు.

    తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు తుదిదశకు చేరాయి. ఇందులో అధికార టీఆర్ఎస్ పార్టీ 56 స్తానాలతో లీడింగ్ లో ఉంది. ఆ తర్వాత ఎంఐఎం 42 స్థానాల్లో గెలిచి 1 స్థానంలో లీడ్ లో ఉంది. బీజేపీ 45 గెలిచి 4 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.

    Also Read: సింగిల్ డిజిట్: కాంగ్రెస్ కు ఘోర అవమానం

    ప్రస్తుతం మేయర్ పీటం ఏ ఒక్కపార్టీకి దక్కే అవకాశాలు లేవు. మిత్రపక్షాలైన టీఆర్ఎస్, ఎంఐఎం కలిస్తే మేయర్ పీఠాన్ని అధిరోహించవచ్చు. బీజేపీతో టీఆర్ఎస్, ఎంఐఎం కలువదు కాబట్టి అది ప్రతిపక్షంలోనే ఉండనుంది.

    ఒక వేళ ఎంఐఎం మద్దతు లేకుండా గ్రేటర్ పీఠాన్ని ఎక్స్ ఆఫీషియో ఓట్లతో టీఆర్ఎస్ సొంతం చేసుకోవచ్చు. దాదాపు 41 ఎక్స్ అఫిషియో సీట్లు టీఆర్ఎస్ కి ఉన్నాయి. ఇప్పుడు 56 సీట్లు రావడంతో 41 కలిపితే 97 సీట్లు అవుతాయి. అప్పుడు ఈజీగా మేయర్ పీఠం సాధించవచ్చు. మరి ఫలితాలు పూర్తిగా వెలువడితే కానీ క్లారిటీ రాకపోవచ్చు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్