https://oktelugu.com/

ఒక్క రూపాయి కట్టకుండానే కారు కొనే ఛాన్స్.. ఎలా అంటే..?

మనలో చాలామంది కొత్త కారు కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే కారు ఖరీదు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది కొత్త కారు కొనుగోలు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్స్ కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే కారును కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది. Also Read: ఆన్ లైన్ యాప్స్ లో రుణాలు తీసుకునే వాళ్లకు షాకింగ్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 4, 2020 / 06:40 PM IST
    Follow us on


    మనలో చాలామంది కొత్త కారు కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే కారు ఖరీదు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది కొత్త కారు కొనుగోలు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్స్ కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే కారును కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తోంది.

    Also Read: ఆన్ లైన్ యాప్స్ లో రుణాలు తీసుకునే వాళ్లకు షాకింగ్ న్యూస్..?

    కొత్త కారును కొనుగోలు చేసిన వాళ్లు డబ్బులను సులభ వాయిదాల రూపంలో చెల్లించవచ్చు. మోస్ట్ పాపులర్ కార్లలో ఒకటైన ఎస్‌యూవీ ఎంజీ హెక్టార్ కారును నెలకు 22,222 రూపాయల చొప్పున ఈఎంఐ చెల్లించేలా ఉండేలా ఆఫర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. కొత్త సంవత్సరానికి మరికొన్ని రోజులే ఉండటంతో కార్ల కంపెనీలు కార్లపై అదిరిపోయే ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ కారును కొనుగోలు చేసిన వాళ్లకు కంపెనీ ఇతర ప్రయోజనాలను సైతం కల్పిస్తోంది.

    Also Read: ఆ బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త.. డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ..?

    ఎటువంటి లేబర్ కాస్ట్ లేకుండా ఉచితంగా ఐదు సర్వీస్ లను చేయించుకోవడంతో పాటు ఈ కారుపై ఐదు సంవత్సరాల వరకు అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల రోడ్ అసిస్టెంట్ ను పొందే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. ఈ కారుపై ఐదు సంవత్సరాల వారంటీని సైతం కంపెనీ అందిస్తూ ఉండటం గమనార్హం. ఈ కారు ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధర 12.83 లక్షల రూపాయలుగా ఉంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    టాప్ వేరియంట్ ధర 18.8 లక్షల రూపాయలుగా ఉంది. డీజిల్ ఇంజిన్ తో 5 సీటర్ కెపాసిటీతో ఈ కారు ప్రస్తుతం అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజిన్ కావాలనుకునే వాళ్లు పెట్రోల్ ఇంజిన్ కారును కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది. కొత్త కారు కొనాలనుకునే వారికి ఈ ఆఫర్ వల్ల ప్రయోజనం చేకూరుతుంది.