https://oktelugu.com/

మెగాస్టార్ కోసం ప్రత్యేక సెట్.. సాంగ్స్ ను కూడా.. !

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ లేకుండానే ఆచార్య సినిమా షూటింగ్ ప్లాన్ చేశాడు. కానీ మెగాస్టార్ కరోనా కాలంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా షూట్ లో పాల్గొంటున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా కోసం సారథి స్టూడియోలో ఓ పురాతన దేవాలయం సెట్ వేశారని.. రేపటి నుండి ఆ సెట్ లో షూటింగ్ ను జరపాలని.. ఆ తరువాత అనగా జనవరిలో మెగాస్టార్ పై సాంగ్స్ షూట్ చేస్తారని తెలుస్తోంది. నిజానికి సాంగ్స్ ను […]

Written By:
  • admin
  • , Updated On : December 4, 2020 / 07:22 PM IST
    Follow us on


    సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ, మెగాస్టార్ లేకుండానే ఆచార్య సినిమా షూటింగ్ ప్లాన్ చేశాడు. కానీ మెగాస్టార్ కరోనా కాలంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా షూట్ లో పాల్గొంటున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా కోసం సారథి స్టూడియోలో ఓ పురాతన దేవాలయం సెట్ వేశారని.. రేపటి నుండి ఆ సెట్ లో షూటింగ్ ను జరపాలని.. ఆ తరువాత అనగా జనవరిలో మెగాస్టార్ పై సాంగ్స్ షూట్ చేస్తారని తెలుస్తోంది. నిజానికి సాంగ్స్ ను ఈ నెలలోనే షూట్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ కరోనా ప్రవాహం ముందు గ్రూప్ సాంగ్స్ షూటింగ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. మరి వచ్చే నెల కూడా కరోనా ఇంకా విజృంభించనుంది. ఆ లెక్కన కొరటాల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఎలా షూట్ చేస్తాడో చూడాలి.

    Also Read: `కేజీఎఫ్’ టీజర్ డేట్ ఫిక్స్.. యశ్ కి స్పెషల్ ట్రీట్ !

    ఇక ఈ ‘ఆచార్య’ రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన అన్యాయాలను అక్రమాలను అరికట్టే శక్తిగా రాబోతున్నాడని.. ముఖ్యంగా దేవాలయాల పేరుతో జరుగుతున్న అవకతవకల పై పోరాటం చేసే ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడని తెలుస్తోంది. ఇక మెగాస్టార్ ను ఎండోమెంట్స్ విభాగానికి చెందిన అధికారిగా కొరటాల ఈ సినిమాలో చూపించబోతున్నాడనగానే మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పై తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

    Also Read: ఆ యంగ్ డైరెక్టర్ కు మహేష్ చాన్స్?

    పైగా మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు లుక్ కూడా చేంజ్ చేయడం ఆసక్తి రేపుతోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ సరసన చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. అన్నట్టు సారథి స్టూడియోలో మొదలయ్యే షూట్ లో కాజల్ కూడా పాల్గొనబోతుందట. ఆమె ఈ సినిమాలో ఒక జర్నలిస్ట్ గా నటిస్తోందని తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడట. అలాగే ఈ చిత్రంలో రెజీనా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్