దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం ఉన్నఫలంగా లాక్డౌన్ విధించింది. దీంతో ఎక్కడివాళ్లు అక్కడే స్తంభించిపోవడంతో పేద, మధ్యతరగతి, వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సమయంలో వలస కార్మికులను ఆదుకునేందుకు సోనూసూద్ ముందుకొచ్చాడు.
Also Read: కరోనాను టార్గెట్ చేసిన బాలయ్య.. ఏమన్నాడంటే?
లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల కోసం సొంత బస్సులను ఏర్పాటు చేసి సొంత ఊళ్లకు పంపించాడు. కొందరినీ రైళ్లలో పంపించాడు. అదేవిధంగా నిజంగా సాయం కావాల్సిన వారిని గుర్తించి వారికి సాయం చేస్తూనే ఉన్నాడు. దీంతో సోనూసుద్ రియల్ హీరో అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు.
Also Read: మిడిల్ క్లాస్ మెలోడీస్’ను అమెజాన్ ప్రైమ్ ఎంతకు కొనుగోలు చేసింది?
దీపావళి సందర్భంగా ఈటీవీలో ‘శ్రీ కనక మహాలక్ష్మీ లక్కీడ్రా’ అనే స్పెషల్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సోనూసుద్ సాయం చేసిన పలువురు స్టేజీపైకి పిలిచి మాట్లాడించింది. ఈ సందర్భంగా సోనూసుద్ తమకు అందించిన సాయం గురించి చెప్పడంతోపాటు ఆయనపై ప్రశంసలు కురిపించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోనూసుధ్ మాట్లాడారు. తన సాయం వెనుక ఎవరు ఉన్నారో.. తనకు స్ఫూర్తిని ఇచ్చింది ఎవరో తెలిపాడు. నిజమైన సక్సస్ అంటే ఒకరికి సాయం అవసరమైనప్పుడు వాళ్లు అడగకముందే వెళ్లి సాయం చేయడం అని అన్నారు. ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో దానికి కారణం మా అమ్మనాన్నలే అని చెప్పాడు. తనను ఎవరూ కూడా దేవుడిని చేయద్దని.. అందరిలా నేను సాధారణమైన వ్యక్తేనని తెలిపారు.