https://oktelugu.com/

భారత్ లో కరోనా వ్యాక్సిన్ ఎంతమందికి అవసరం..?

కొత్త ఏడాదిలో కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించిన కేంద్రం.. నేడు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహిస్తోంది. ఇది పూర్తయిన తర్వాత దేశంలో కరోనా వ్యాక్సిన్ ను కేంద్రం పంపిణీ చేయనుంది. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ను అత్యసవరంగా వినియోగించుకునేందుకు కేంద్రం వ్యాక్సిన్ నిపుణుల కమిటీ  ఇప్పటికే  ఇచ్చింది. ఇది పూర్తి వినియోగంలోకి రావాలంటే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) అనుమతి ఇవ్వాల్సి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 2, 2021 / 01:51 PM IST
    Follow us on

    కొత్త ఏడాదిలో కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించిన కేంద్రం.. నేడు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహిస్తోంది. ఇది పూర్తయిన తర్వాత దేశంలో కరోనా వ్యాక్సిన్ ను కేంద్రం పంపిణీ చేయనుంది.

    కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ను అత్యసవరంగా వినియోగించుకునేందుకు కేంద్రం వ్యాక్సిన్ నిపుణుల కమిటీ  ఇప్పటికే  ఇచ్చింది. ఇది పూర్తి వినియోగంలోకి రావాలంటే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ) అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.

    మరో రెండ్రోజుల్లో కోవిషిల్డ్ వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ రానుందని సమాచారం. డీజీసీఐ అనుమతి రాగానే సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఐదు కోట్ల మందికి తొలివిడుతగా వ్యాక్సిన్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.

    కోవిషిల్డ్ వ్యాక్సిన్ తోపాటు మరికొన్ని వ్యాక్సిన్లను కూడా పంపిణీ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. మొత్తంగా 30కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే మిగిలిన పరిస్థితి ఏంటీ? అనే చర్చ నడుస్తోంది.

    కరోనా వ్యాక్సిన్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీఒక్కరికి అందించాల్సి ఉంటుంది. అయితే తొలివిడుతగా కరోనా ఫ్రంట్ లైన్ వర్కర్లు.. ఇతర జబ్బులు ఉన్నవాళ్లు.. వృద్ధులకు కరోనా వ్యాక్సిన్ అందించనున్నారు.

    కరోనాపై పోరాడుతున్న వారితోపాటు.. కరోనా బారినపడే వారికి ముందుగా వ్యాక్సిన్ అందించడం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వీలవుతుంది. దీంతోనే ముందుగా వీరికి కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలుస్తోంది.

    కరోనా వైరస్ వ్యాప్తిని అరికడుతూ క్రమంగా దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ ను అందుబాటులో ఉంచేలా కేంద్రం కసరత్తులు చేస్తుంది. మరోవైపు దేశంలో కరోనాను జయిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతుండటం గమనార్హం. అయితే దేశంలో ఎంతమందికి కరోనా వ్యాక్సిన్ అవసరం ఏర్పడుతుందనేది మాత్రం కేంద్రం చెప్పలేకపోతుంది.