https://oktelugu.com/

20 రూపాయల కోసం ఆశపడితే లక్షన్నర మాయం.. ఏం జరిగిందంటే..?

దేశంలో మోసగాళ్లు అవతలి వ్యక్తికి డబ్బును ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు మోసగాళ్లు కొత్త ట్రిక్కులతో మోసాలకు పాల్పడుతుంటే మరి కొందరు మోసగాళ్లు మాత్రం పాత ట్రిక్కులనే కొత్తగా ప్రయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. జార్ఖండ్ లోని సాహిబ్‌గంజ్ జిల్లాలోని బర్హడవలో ఒక వ్యక్తి 20 రూపాయల కోసం ఆశపడి లక్షన్నర రూపాయలు మోసపోయాడు. Also Read: బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. మూడు రోజులు సెలవులు..? హరిహరా అనే గ్రామానికి గ్రామానికి చెందిన రఫీకుల్ అనే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 22, 2020 / 06:40 PM IST
    Follow us on


    దేశంలో మోసగాళ్లు అవతలి వ్యక్తికి డబ్బును ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు మోసగాళ్లు కొత్త ట్రిక్కులతో మోసాలకు పాల్పడుతుంటే మరి కొందరు మోసగాళ్లు మాత్రం పాత ట్రిక్కులనే కొత్తగా ప్రయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. జార్ఖండ్ లోని సాహిబ్‌గంజ్ జిల్లాలోని బర్హడవలో ఒక వ్యక్తి 20 రూపాయల కోసం ఆశపడి లక్షన్నర రూపాయలు మోసపోయాడు.

    Also Read: బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. మూడు రోజులు సెలవులు..?

    హరిహరా అనే గ్రామానికి గ్రామానికి చెందిన రఫీకుల్ అనే వ్యక్తి బర్హడవా లోని బ్యాంక్ నుంచి లక్షన్నర రూపాయలు ఖర్చుల నిమిత్తం విత్ డ్రా చేసుకున్నాడు. ఆ డబ్బును తన దగ్గర ఉన్న బ్యాగులో పెట్టుకుని బయటకు వచ్చాడు. తెచ్చుకున్న డబ్బును రఫీకుల్ వాహనం డిక్కీలో పెట్టబోతున్న సమయంలో ఒక వ్యక్తి మీ డబ్బులు పడిపోయాయంటూ రఫీకుల్ కు చెప్పాడు. రఫీకుల్ చూడగా కొంత దూరంలో అతనికి 20 రూపాయల నోటు కనిపించింది.

    Also Read: కస్టమర్లకు అమెజాన్ శుభవార్త.. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..?

    రఫీకుల్ లక్షన్నర రూపాయల బ్యాగ్ ను బైక్ పైనే ఉంచి 20 రూపాయల నోటు కోసం వెళ్లగా అదే సమయంలో యువకుడు డబ్బులు ఉన్న బ్యాగ్ ను తీసుకుని బైక్ పై నుంచి పరారయ్యాడు. ఊహించని విధంగా జరగడంతో రఫీకుల్ షాక్ అయ్యాడు. ఏం చేయాలో పాలుపోని రఫీకుల్ వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    బ్యాంక్ సీసీ ఫుటేజీలను పరిశీలించి ఫుటేజీ ఆధారంగా పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బ్యాంకులో లావాదేవీలు చేసేవాళ్లు ఇలాంటి మోసాల పట్ల అవగాహన పెంచుకుని జాగ్రత్త వహించాలని పోలీసులు చెబుతున్నారు.