ఉప్పెన క్లైమాక్స్ లీక్.. ఇదేనట?

ఉప్పెన సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ట్రైలర్ చూశాక ఈ సినిమాలో హీరో వైష్ణవ్ తేజ్ ప్రేమ విషాదాంతంగా మారిపోతుందని అర్థమవుతోంది. ఈ క్రమంలోనే విలన్ విజయ్ సేతుపతి.. హీరో వైష్ణవ్ ను ఏదో చేస్తాడని నెటిజన్లు స్టోరీ క్లైమాక్స్ ను నెట్ లో పెట్టేస్తున్నారు. గొప్ప ప్రేమలన్నీ విషాదంతోనే ముగిశాయి. ఓ లైలా మజ్నూ, దేవదాస్ పార్వతి- ముంతాజ్ -షాజహాన్ ఇలా ప్రేమ ఎప్పుడూ చరిత్రలోనే కలిసిపోయింది. ప్రేమికులు దూరమయ్యారు. ఓ విషాద ప్రేమ […]

Written By: NARESH, Updated On : February 9, 2021 9:52 am
Follow us on

ఉప్పెన సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ట్రైలర్ చూశాక ఈ సినిమాలో హీరో వైష్ణవ్ తేజ్ ప్రేమ విషాదాంతంగా మారిపోతుందని అర్థమవుతోంది. ఈ క్రమంలోనే విలన్ విజయ్ సేతుపతి.. హీరో వైష్ణవ్ ను ఏదో చేస్తాడని నెటిజన్లు స్టోరీ క్లైమాక్స్ ను నెట్ లో పెట్టేస్తున్నారు.

గొప్ప ప్రేమలన్నీ విషాదంతోనే ముగిశాయి. ఓ లైలా మజ్నూ, దేవదాస్ పార్వతి- ముంతాజ్ -షాజహాన్ ఇలా ప్రేమ ఎప్పుడూ చరిత్రలోనే కలిసిపోయింది. ప్రేమికులు దూరమయ్యారు. ఓ విషాద ప్రేమ కథను సినిమా తీయడానికి సుకుమార్, ఆయన శిష్యుడు బుచ్చిబాబు ‘ఉప్పెన’ వస్తున్నారు.మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్న మూవీ ‘ఉప్పెన’. ఈ ప్రేమకథా చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ తో రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ గా కనిపించనున్నాడు.

ఈ మూవీ క్లైమాక్స్ గురించి ఇప్పుడు లీక్స్ బయటకు వచ్చాయి. తన కూతురిని ప్రేమించినందుకు విలన్ విజయ్ సేతుపతి హీరో వైష్ణవ్ తేజ్ చేతులు నరికేస్తాడని కొందరు.. హీరోను చంపేస్తారని ఇంకొందరు.. ఇంకొందరు తన కూతురిని ప్రేమించాడనే కోపంతో హీరోను నపుంసకుడిగా మార్చేస్తాడని కొందరు చెబుతున్నారు.

దీనిపై తాజాగా హీరో వైష్ణవ్ తేజ్ ఇంటర్వ్యూలో స్పందించారు. పురుషాంగం కత్తిరించే అంశంపై సోషల్ మీడియాలో కామెడీ చేస్తున్నారని.. కానీ సినిమా చూస్తే సీన్ లో లోతు తెలుస్తుందని వైష్ణవ్ తేజ్ అనడంతో క్లైమాక్స్ ప్రచారం నిజమేనని అర్థమవుతోంది. సినిమాలో క్లైమాక్స్ అద్భుతమని.. అది సీన్ చూశాక ఉప్పెన టైటిల్ కు సార్థకత వస్తుందిన వైష్ణవ్ చెప్పుకొచ్చాడు. మరి సినిమా విడుదలయ్యాకే అసలు కథ ఏంటనేది తేలనుంది.