వెనక్కి తగ్గిన నిమ్మగడ్డ.. జగన్ కు గొప్ప ఊరట

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఎట్టకేలకు గవర్నర్ తో భేటి తర్వాత వెనక్కితగ్గాడు. ఏకగ్రీవాలకు బ్రేక్ వేసి ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన ఎస్ఈసీ ఎట్టకేలకు మెత్తబడ్డారు. కొద్దిరోజులుగా జగన్ సర్కార్ ఫైట్ చేస్తున్న నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని ప్రతీ విషయంలోనూ ఇరుకునపెడుతున్నారు.పంచాయతీ ఎన్నికల్లో తన ప్రతాపం చూపిస్తున్నారు. ఇటీవల చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధిక ఏకగ్రీవాలు కావడంతో వాటిని హోల్డ్ లో పెట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లను నిమ్మగడ్డ ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 110 మంది, గుంటూరు […]

Written By: NARESH, Updated On : February 8, 2021 9:11 pm
Follow us on

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఎట్టకేలకు గవర్నర్ తో భేటి తర్వాత వెనక్కితగ్గాడు. ఏకగ్రీవాలకు బ్రేక్ వేసి ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన ఎస్ఈసీ ఎట్టకేలకు మెత్తబడ్డారు. కొద్దిరోజులుగా జగన్ సర్కార్ ఫైట్ చేస్తున్న నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని ప్రతీ విషయంలోనూ ఇరుకునపెడుతున్నారు.పంచాయతీ ఎన్నికల్లో తన ప్రతాపం చూపిస్తున్నారు.

ఇటీవల చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధిక ఏకగ్రీవాలు కావడంతో వాటిని హోల్డ్ లో పెట్టాలని ఆయా జిల్లాల కలెక్టర్లను నిమ్మగడ్డ ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 110 మంది, గుంటూరు జిల్లాలో 67 మంది సర్పించ్ లు ఏకగ్రీవమయ్యారు. వీటిని నిమ్మగడ్డ హోల్డ్ లో పెట్టడంతో అధికార పార్టీ నేతలు, మంత్రులు సైతం నిమ్మగడ్డపై దుమ్మెత్తిపోశారు.

ఈ క్రమంలోనే మంత్రి పెద్దిరెడ్డి సహా కొందరు మంత్రులు ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలను పట్టించుకోకుండా ఫలితాలను ప్రకటించాలని.. నిమ్మగడ్డ మాట వింటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

దీంతో నిమ్మగడ్డ , మంత్రుల మధ్యలో ఏపీ అధికారులు నలిగిపోయారు. ఈ క్రమంలోనే గవర్నర్ తో భేటి తర్వాత నిమ్మగడ్డ రమేశ్ వెనక్కితగ్గారు. పెండింగ్ లో పెట్టిన ఏకగ్రీవాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లకు సమాచారం అందించారు.

రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో 525 మంది సర్పంచ్ లు ఏకగ్రీవమయ్యాయి. రేపే మొదటి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో నిమ్మగడ్డ నిర్ణయం జగన్ సర్కార్ కు ఊరటనిచ్చింది.