
హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనాలపై తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ ను కొట్టివేసింది. పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ ఒక్క ఏడాది మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం కోరగా.. కోర్టు అంగీకరించలేదు. పీవోపీ విగ్రహాల నిమజ్జనాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలంది.