
Bank Jobs 2021: హైదరాబాద్‌లోని మహేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన భర్తీ జరగనుంది. ఈ మెయిల్ ద్వారా లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 109 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, చీఫ్ రిస్క్ ఆఫీసర్, జనరల్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ అర్హతలతో పాటు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎంబీఏ/ సీఎఫ్‌ఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఏ/ సీఎస్/ సీఏఐఐబీ అర్హతలు ఉండాలి. 40 నుంచి 53 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. recruit@apmaheshbank.com వెబ్ సైట్ లింక్ కు దరఖాస్తులను పంపించడం ద్వారా ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 24వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.apmaheshbank.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే వాళ్లు హైదరాబాద్ బంజారాహిల్స్, రోడ్ నెం. 12, ఆంధ్రప్రదేశ్ మహేశ్ బ్యాంక్ లిమిటెడ్, హెడ్ ఆఫీస్ అడ్రస్ కు దరఖాస్తులను పంపాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు మంచి వేతనం లభిస్తుంది.