జలుబు చేసినప్పుడు తినకూడని ఆహార పదార్థాలు ఇవే..?

ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఆ సమయంలో సరైన ఆహారం తీసుకుంటే మాత్రమే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. సమతుల్యత, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అనారోగ్య సమస్యలు ఉన్న సమయంలో అయితే కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. ముఖ్యంగా జలుబు చేసిన సమయంలో కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా జలుబు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా […]

Written By: Kusuma Aggunna, Updated On : February 13, 2021 7:18 pm
Follow us on

ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఆ సమయంలో సరైన ఆహారం తీసుకుంటే మాత్రమే త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. సమతుల్యత, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అనారోగ్య సమస్యలు ఉన్న సమయంలో అయితే కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. ముఖ్యంగా జలుబు చేసిన సమయంలో కొన్ని ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు.

కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా జలుబు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జలుబు చేసిన సమయంలో పాలు అస్సలు తీసుకోకూడదు. పాలు శ్లేష్మం ఉత్పత్తిని పెంచడంతో పాటు ఉత్పత్తి చేయబడిన శ్లేష్మం గట్టిపడటంలో తోడ్పడతాయి. పాల ఉత్పత్తులు మంటను ప్రేరేపించడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ప్రతిస్పందనను నెమ్మదించి అనారోగ్య లక్షణాలను తీవ్రతరం చేస్తుంది.

జలుబు చేసిన సమయంలో ప్రాసెస్ చేసిన ఆహారాలను తీసుకోకూడదు. ప్రాసెస్ చేసిన ఆహారాలు పరిమితంగా పోషకాలను కలిగి ఉండటంతో పాటు ఆరోగ్యానికి హని చేస్తాయి. జలుబు చేసిన సమయంలో మద్యం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ ను తీసుకుంటే ప్రమాదకరమైన సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.

ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేయడంతో పాటు శ్లేష్మాన్ని చెడు పదార్థంగా మార్చి తలనొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఇమ్యూనిటీ పవర్ ను తగ్గించడంతో పాటు తలనొప్పి సమస్యకు కారణమవుతుంది. అందువల్ల జలుబు చేసిన సమయంలో ఆల్కహాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, పాలకు దూరంగా ఉంటే మంచిది.