https://oktelugu.com/

బాలయ్య బాబు ఇలా షాకిచ్చాడు!

నటరత్న బాలయ్య తండ్రికి తగ్గ తనయుడిగా టాలీవుడ్ లో బాగానే పాపులర్ అయ్యాడు.నాడు ఎన్టీఆర్ పౌరాణికపాత్రల్లో అలరిస్తే బాలయ్య కూడా ‘భైరవద్వీపం’ ‘శాతకర్ణి’ సహా కొన్ని సినిమాల్లో ఇలాంటి పౌరాణిక పాత్రలతో తన ముచ్చట తీర్చుకున్నాడు. Also Read: అరియానా రేటు రోజుకు లక్ష.. 25వేలకే వచ్చింది.. అయితే ఇప్పుడు బాలయ్య బాబు షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చాడు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ మూవీలో భాగంగా తీసిన పాత్రలోని కొన్ని అరుదైన ఫొటోలను […]

Written By:
  • NARESH
  • , Updated On : February 23, 2021 / 09:03 PM IST
    Follow us on

    నటరత్న బాలయ్య తండ్రికి తగ్గ తనయుడిగా టాలీవుడ్ లో బాగానే పాపులర్ అయ్యాడు.నాడు ఎన్టీఆర్ పౌరాణికపాత్రల్లో అలరిస్తే బాలయ్య కూడా ‘భైరవద్వీపం’ ‘శాతకర్ణి’ సహా కొన్ని సినిమాల్లో ఇలాంటి పౌరాణిక పాత్రలతో తన ముచ్చట తీర్చుకున్నాడు.

    Also Read: అరియానా రేటు రోజుకు లక్ష.. 25వేలకే వచ్చింది..

    అయితే ఇప్పుడు బాలయ్య బాబు షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చాడు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ మూవీలో భాగంగా తీసిన పాత్రలోని కొన్ని అరుదైన ఫొటోలను తాజాగా షేర్ చేసి తన జ్ఞాపకాలను పంచుకున్నాడు.

    తాజాగా బాలయ్య బాబు భీష్ముడి గెటప్ లో వృద్ధుడిగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఎన్టీఆర్-కథానాయకుడు మూవీలో ఎడిటింగ్ లో తీసేసిన ‘భీష్ముడి’ గెటప్ ఫొటోలను అభిమానుల కోసం పంచాడు.

    Also Read: న‌రేష్ న్యూడ్ గా న‌టించింది నిజ‌మేనా? క్లారిటీ ఇచ్చిన ద‌ర్శ‌కుడు!

    భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా అభిమానులకు ఓ ప్రత్యేక కానుక అందించాడు బాలయ్య. భీష్ముడి వేషం ధరించిన ఫొటోలను విడుదల చేశాడు. ఎన్టీఆర్ కూడా అప్పట్లో భీష్మ పాత్రలో ఒదిగిపోయాడు. తండ్రి లాగే తనయుడు ఆ భీష్మ పాత్రలో అలరించాడు. అయితే ఈ పాత్ర సినిమాల్లో లేకపోవడంతో విడిగా తాజాగా రిలీజ్ చేశాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్