తెలుగు రాష్ట్రాల ప్రజలు మునగకాయలతో చేసిన వంటకాలను ఎంతో ఇష్టంగా తింటారనే సంగతి తెలిసిందే. ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే మునగకాయల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మునగకాయలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఎ, సి విటమిన్లతో పాటు క్యాల్షియం లభిస్తాయి. మనం నిత్యజీవితంలో ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో మునగకాయలు సహాయపడతాయి.
మునగకాయలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. మునగాకాయలు అనేక రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడే లక్షణాలను కలిగి ఉంటాయి. మనలో చాలామందిని తరచూ వేధించే ముక్కుదిబ్బడ, చెవి సంబంధిత సమస్యలను దూరం చేయడంలో మునగకాయలు సహాయపడతాయి. మునగలో ఉండే ఐరన్ సులభంగా రక్తహీనత సమస్యకు చెక్ పెడుతుంది. గర్భిణీ మహిళలను మునగకాయలను ఎక్కువగా తీసుకుంటే మంచిది.
గర్భిణీ మహిళలలో తలతిరగడం, వాంతులు, నిస్సత్తువ లాంటి సమస్యలను దూరం చేయడంలో మునగకాయలు తోడ్పడతాయి. ప్రసవ నొప్పులను తగ్గించడంతో పాటు పోస్ట్ డెలివరీ కాంప్లికేషన్స్ ను తగ్గించడంలో మునగకాయలు సహాయపడతాయి. గర్భిణీ మహిళలు మునగ కాయలను తీసుకోవడం వల్ల ప్రసవం తర్వాత సరిపడా పాలు పడతాయి. మునగకాయలు కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
శరీరానికి అవసరమైన ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు మునగకాయల ద్వారా పుష్కలంగా లభిస్తాయి. అయితే గర్భిణీ స్త్రీలు వైద్యుని సూచనల ప్రకారమే మునగను వాడితే మంచిది. మధుమేహంతో బాధ పడుతున్న వాళ్లు మునగకాయలను తీసుకోకూడదు. ముగనకాయలను మరీ ఎక్కువగా తీసుకుంటే కాలేయం, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.