https://oktelugu.com/

Egg Benefits : వీళ్లు ఖచ్చితంగా రోజూ ఒక గుడ్డు తినాలి

Egg Benefits: అత్యంత చౌకగా దొరికే పోషకాహారాలలో కోడిగుడ్డు(Egg) ప్రాధాన్యత గురించి అందరికి తెలిసిందే. గుడ్డులో ప్రొటీన్ల శాతం ఎక్కువే. ప్రతి రోజు గుడ్డు తింటే శరీరంలో శక్తి పెరుగుతుంది. ఇందులో కాల్షియం, ఐరన్ 90 శాతం ఉంటుంది. గుడ్డులో ఉండే పచ్చసొన, తెల్లటి సొనలో ప్రోటీన్లు శాతం ఉంటుంది. అందుకే పోషకాహారానికి కోడిగుడ్డు ప్రత్యేక ఆహారం. గుడ్లు రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి. శరీర బరువును అదుపు చేయడంలో గుడ్డు ప్రధాన […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 24, 2021 10:08 am
    Follow us on

    Health Benefits of Eating EggsEgg Benefits: అత్యంత చౌకగా దొరికే పోషకాహారాలలో కోడిగుడ్డు(Egg) ప్రాధాన్యత గురించి అందరికి తెలిసిందే. గుడ్డులో ప్రొటీన్ల శాతం ఎక్కువే. ప్రతి రోజు గుడ్డు తింటే శరీరంలో శక్తి పెరుగుతుంది. ఇందులో కాల్షియం, ఐరన్ 90 శాతం ఉంటుంది. గుడ్డులో ఉండే పచ్చసొన, తెల్లటి సొనలో ప్రోటీన్లు శాతం ఉంటుంది. అందుకే పోషకాహారానికి కోడిగుడ్డు ప్రత్యేక ఆహారం. గుడ్లు రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడతాయి. శరీర బరువును అదుపు చేయడంలో గుడ్డు ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులే చెబుతున్నారు.

    కోడిగుడ్డు ద్వారా శరీరానికి అత్యధిక పోషకాలు లబిస్తాయి. గుడ్డులో శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నాయి. విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ బి12, మెగ్నీషియం, గుడ్డులో పుష్కలంగా ఉన్నాయి. కోడిగుడ్డు మెదడు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. గుడ్డు సొనలో ఉండే కోలిన్ అనే పోషక పదార్థం మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కోడిగుడ్డులో ఐరన్ ను శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఈ ఐరన్ గర్భిణులు, బాలింతలకు లాబం చేస్తుంది. గర్భిణులు ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డు తింటే పుట్టబోయే బిడ్డకు మేలు జరుగుుతుంది.

    మహిళలల్లో రొమ్ము క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. జుట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకు గుడ్డు లాభం చేకూరుస్తుంది. గుడ్డులో ఉండే విటమిన్ ఎ కళ్లకు ఆరోగ్యంగా నిలుస్తుంది. గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉండడంతో ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడుతుంది. నరాల బలహీనత ఉన్న వారు రోజు క్రమం తప్పకుండా గుడ్డు తీసుకుంటే ప్రయోజనం కలుగుతుంది.

    గుడ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఎముకలను ధృడంగా తయారు చేస్తుంది. గుడ్డులో కేలరీలు, ప్రొటీన్, కొవ్వులు, కాల్షియం, భాస్వరం, సెలీనియం, విటమిన్ ఎ, విటమిన్ బి5, విటమిన్ బి12, విటమిన్ బి, విటమిన్ ఐ, విటమిన్ కె, విటమిన్ బి6 వంటి పోషకాలు ఉంటాయి. గుడ్డులో ట్రిప్టోఫాన్, ట్రైరోసిన్ ఉంటాయి. అదనంగా గుడ్డులో అమైనో అమ్లాలు కూడా ఉంటాయి. దీంతో గుడ్డును అందరు తీసుకుని ప్రయోజనం పొందాలి.