
Chiranjeevi expectations on Pawan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి నటి సుధ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ తొలి చిత్రం ‘అక్కడ అమ్మాయి-ఇక్కడ అమ్మాయి’ చేసేటప్పుడే తాను ఆ చిత్రంలో పవన్ ను దగ్గరి నుంచి చూశానని.. అతడు స్టార్ గా ఎదుగుతాడని అప్పుడే నటుడు చంద్రమోహన్ తో అన్నానని నటి సుధ అన్నారు.
తెలుగు సినిమాల్లో సీనియర్ నటిగా.. తల్లిగా, వదినగా, అమ్మగా, అత్తగా నటించిన సుధ చిరంజీవి(Chiranjeevi) సహా సీనియర్ నటీనటులు, కొత్త వారితో ఎన్నో సినిమాల్లో నటించానన్నారు.
చిరంజీవి కుటుంబంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని.. నటించుకుంటూ వెళ్లానని నటి సుధ అన్నారు. పవన్ కళ్యాణ్ ఎంతో సౌమ్యుడు, మృదుస్వభావి.. పెద్దగా కలవడని సుధ తెలిపారు. పెద్దగా ఎవరితోనూ సాన్నిహిత్యంగా మెలగడని.. రిజర్వ్ గా ఉంటాడని సుధ తెలిపారు.
పవన్ మనస్తత్వం అలాగే రిజర్వ్ గా ఉంటారని.. పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కువ ఎవరితోనూ మాట్లాడడని నటి సుధ అన్నారు. ఆయన మనసులో ఏముందో తెలియదన్నారు. పవన్ కళ్యాణ్ గొప్ప స్టార్ గా ఎదిగాలని చిరంజీవి కోరుకున్నట్టు సుధ తెలిపారు. ఇప్పుడు అదే జరిగిందని వివరించారు.
చిరంజీవిని కలిసిన సందర్భంలో మీ తమ్ముడు ఎంతో స్మార్ట్ గా.. యాక్టివ్, స్లిమ్ సూపర్ గా ఉన్నాడని అన్నానని.. గొప్ప స్టార్ గా ఎదుగుతాడని చిరంజీవితో అన్నానని సుధ తెలిపారు. పవన్ గురించి కూడా చిరంజీవి అదే కోరుకున్నాడని సుధ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరిగి చూడాలనుకునే వ్యక్తి పవన్ అని సుధ అన్నారు.
