https://oktelugu.com/

కోవాగ్జిన్ తీసుకున్నారా? మీకు గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ సంచలన విషయాన్ని వెల్లడించింది. దేశంలో కరోనా ఉధృతి, వ్యాక్సిన్ల పనితీరుపై అధ్యయనం చేసిన సంస్థ ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది. భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన ‘కోవాగ్జిన్’ టీకా అద్భుతంగా పనిచేస్తోందని తేలింది. ‘కోవాగ్జిన్ డెల్టా ప్లస్ వేరియంట్ పై సమర్థంగా పనిచేస్తోందని తాజాగా భారత వైద్యపరిశోధన మండలి (ఐసీఎంఆర్) సంచలన ప్రకటన చేసింది. దేశంలో సెకండ్ వేవ్ కు కారణమైన వైరస్ డెల్టా వేరియంట్. దేశంలో మారణహోమాన్ని ఇది […]

Written By:
  • NARESH
  • , Updated On : August 2, 2021 / 05:13 PM IST
    Follow us on

    కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ సంచలన విషయాన్ని వెల్లడించింది. దేశంలో కరోనా ఉధృతి, వ్యాక్సిన్ల పనితీరుపై అధ్యయనం చేసిన సంస్థ ఈ మేరకు క్లారిటీ ఇచ్చింది. భారత్ బయోటెక్ దేశీయంగా అభివృద్ధి చేసిన ‘కోవాగ్జిన్’ టీకా అద్భుతంగా పనిచేస్తోందని తేలింది. ‘కోవాగ్జిన్ డెల్టా ప్లస్ వేరియంట్ పై సమర్థంగా పనిచేస్తోందని తాజాగా భారత వైద్యపరిశోధన మండలి (ఐసీఎంఆర్) సంచలన ప్రకటన చేసింది.

    దేశంలో సెకండ్ వేవ్ కు కారణమైన వైరస్ డెల్టా వేరియంట్. దేశంలో మారణహోమాన్ని ఇది సృష్టించింది. కోట్ల మందికి సోకి.. వేల మంది ప్రాణాలు తీసింది. ఈ క్రమంలోనే భారత్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా ఆ డెల్టా వేరియంట్ నుంచి కూడా మెరుగైన రక్షణ కల్పిస్తోందని తేలింది. దీంతోపాటు ఇప్పుడు థర్డ్ వేవ్ కు కారణమవుతోన్న డెల్టా ప్లస్ వేరియంట్ ను కూడా ఈ కోవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్ తెలిపింది.

    కరోనా వైరస్ ప్రబలిన తొలి నాళ్లలోనే ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) సహకారంతో భారత్ బయోటెక్ ఈ కోవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేసింది. ఈ టీకాకు 77.8శాతం సమర్థత ఉన్నట్టు తేలింది. ఈ టీకా తీసుకుంటే కరోనా ముప్పి తప్పుతుందని తేలింది. తీవ్రమైన కోవిడ్ 19 రాకుండా ఏకంగా 93.4 శాతం మేరకు నిరోధిస్తుందని తేలింది.